బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్నడు

బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్నడు
  •     నిందితుడి అరెస్ట్..15 గ్రాముల డ్రగ్స్ పట్టివేత

గండిపేట, వెలుగు :  డ్రగ్స్‌‌ అమ్ముతున్న వ్యక్తిని రాజేంద్రనగర్‌‌ పోలీసులు అరెస్టు చేశారు.  నిందితుడి వద్ద నుంచి 15 గ్రాములు ఎండీఎంఏ డ్రగ్స్‌‌, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. రాజేంద్రనగర్‌‌ ఏసీపీ ఆఫీసులో  డీసీపీ సి.హెచ్‌‌.శ్రీనివాస్‌‌ శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆంధ్రకు చెందిన పి.జైచంద్‌‌(26) ఇంజనీరింగ్‌‌ పూర్తి చేసి సిటికి వచ్చాడు. సన్‌‌ సిటీ పీఅండ్‌‌టీ కాలనీలో ఉంటున్నాడు. గతంలో విప్రోలో జాబ్ చేసిన అతడు మానేసి ఓలా డ్రైవర్‌‌గా చేస్తున్నాడు. కర్ణాటకకు చెందిన సోహన్‌‌ అలియాస్‌‌ శ్రీధర్‌‌ నుంచి ఎండీఎంఏ డ్ర గ్స్ ను కొనుగోలు చేసి తెచ్చి సిటీలో యువకులకు అమ్ముతున్నాడు. గత నెల 26న బెంగళూర్‌‌కు వెళ్లి 20 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్  ను తెచ్చాడు. అందులో ఐదు గ్రాము లు అమ్మగా.. మరో 15 గ్రాములను దాచా డు. సమాచారం అందడం తో పోలీసులు పి.జైచంద్‌‌ ఇంట్లో తనిఖీలు చేశారు. డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోగా.. దాని విలువ1.80 లక్షలు ఉంటుంది.  నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌‌కు తరలించారు. ప్రధాన నిందితుడు సోహన్‌‌ పరారీలో ఉన్నాడని, సెర్చ్ చేస్తున్నామని డీసీపీ తెలిపారు. రాజేంద్రనగర్‌‌ ఇన్‌‌స్పెక్టర్‌‌ బి.నాగేంద్రబాబు, ఎస్ ఐ ఎన్‌‌.రమేశ్, ఎస్‌‌ఓటీ ఇన్‌‌స్పెక్టర్‌‌ డి.నాయుడును డీసీపీ అభినందించారు.