రజినీ 170 వ సినిమా.. నరసింహ సీక్వెల్ !

రజినీ 170 వ సినిమా.. నరసింహ  సీక్వెల్ !

ఇప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూ యంగ్‌‌‌‌ హీరోలకు పోటీనిస్తున్నారు రజినీకాంత్. ‘అన్నాత్తే’ తర్వాత ఆయనిక యాక్ట్ చేయరంటూ వచ్చిన పుకార్లకు చెక్ పెడుతూ నెల్సన్ దిలీప్‌‌‌‌కుమార్ డైరెక్షన్‌‌‌‌లో మూవీని అనౌన్స్‌‌‌‌ చేశారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ  సినిమాని ఆగస్ట్‌‌‌‌లో సెట్స్‌‌‌‌కి తీసుకెళ్లి వచ్చే యేడు పొంగల్‌‌‌‌ కానుకగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇది రజినీకాంత్‌‌‌‌కి నూట అరవై తొమ్మిదో చిత్రం. ఇక నూట డెబ్భయ్యో సినిమా గురించి ఓ కొత్త వార్త బైటికొచ్చింది. ఇరవై మూడేళ్ల క్రితం ‘నరసింహ’గా వచ్చి బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేశారు రజినీ. ఆ సినిమాలో ఆయన పాత్రని, స్టైల్‌‌‌‌ని, డైలాగ్స్‌‌‌‌ని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. ముఖ్యంగా ‘నా దారి రహదారి’ అనే డైలాగ్‌‌‌‌ని ఇప్పటికీ చాలామంది వాడుతుంటారు. అంతగా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీకి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రవికుమార్‌‌‌‌‌‌‌‌తో ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్‌‌‌‌లో  కూర్చున్నారట రజినీ. అంతేకాదు.. స్టోరీ డెవెలప్‌‌‌‌మెంట్‌‌‌‌లోనూ కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చి కథకు ఎక్సైటింగ్ రూపం తీసుకొచ్చారట. అప్పట్లో నీలాంబరిగా తనదైన ముద్రవేసుకున్న రమ్యకృష్ణ ఈ సినిమాలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌‌‌‌మెంట్ వచ్చే చాన్స్ ఉంది. దీంతో పాటు అరుణ్ రాజా కామరాజ్ దర్శకత్వంలో నటించడానికి కూడా రజినీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. మరి వీటిలో ఏది ముందు సెట్స్‌‌‌‌కి వెళ్తుందో చూడాలి.