Coolie Box Office: బాక్సాఫీస్ బద్దలు కొట్టేలా ‘కూలీ’ అంచనాలు.. రజనీకాంత్ టార్గెట్ ఎంతంటే?

Coolie Box Office: బాక్సాఫీస్ బద్దలు కొట్టేలా ‘కూలీ’ అంచనాలు.. రజనీకాంత్ టార్గెట్ ఎంతంటే?

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. దర్శకుడు లోకేష్ తెరకెక్కించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ రికార్డులతో.. కూలీ బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. కేవలం ప్రీ-సేల్స్ లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.90 కోట్లకి పైగా వసూళ్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఈ క్రేజీ దృష్ట్యా.. 'కూలీ' ఫస్ట్ డే.. ఇండియాలో రూ. 100 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లు వసూళ్లు సాధిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. లోకేష్ తెరకెక్కించిన లియో ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ. 148.5 కోట్లు వసూలు చేసింది. ఇది ఇప్పటికీ, తమిళ సినిమాకు బెంచ్‌మార్క్. కూలీ ఇప్పుడు ఈ లెక్కను అధిగమించే అవకాశం ఉంది.

ఈ క్రమంలో తమిళంలో తొలి రూ.1,000 కోట్లు సాధించే మూవీగా.. ‘కూలీ’ నిలిచే అవకాశం ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు. అయితే, కూలీ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసింది? తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎలా ఉంది? హిట్ అవ్వాలంటే ఎంత రావాలనే సినీ అభిమానుల్లో ఆసక్తిగా మారింది. మరి బిజినెస్ లెక్కల వివరాలపై ఓ లుక్కేద్దాం.

కూలీ ప్రీ రిలీజ్ బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్ :

'కూలీ' చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషన్స్ వంటి కార్యక్రమాలతో కలిపి కూలీకి రూ.370 కోట్ల భారీ బడ్జెట్‌ అయిందని ట్రేడ్ వర్గాల సమాచారం. కూలీ మొత్తం వరల్డ్ వైడ్ బిజినెస్ రూ.305కోట్లు అని ట్రేడ్ వర్గాల టాక్. ఈ క్రమంలో కూలీ హిట్ అవ్వాలంటే థియేటర్ల నుంచి రూ.308కోట్ల షేర్, రూ.600కోట్ల గ్రాస్ రావాల్సి ఉందని నిపుణుల లెక్కలు చెబుతున్నాయి.

ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు అయిన ఆసియన్ సునీల్, సురేష్ బాబు దక్కించుకున్నారు. దాదాపు రూ.53 కోట్లు వెచ్చించి మరి సినిమా హక్కులు సొంతం చేసుకున్నారని టాక్. ఈ క్రమంలో ఆంధ్రా, నైజాంలలో కూలీ బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు రూ.54 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్, రూ.108 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

Also Read :  కుర్చీ కోసం నాగార్జున యుద్ధం.. మైండ్ బ్లాక్ అయ్యే స్టోరీ ఇదే!

అయితే, మరికొన్ని నివేదికల్లో మాత్రం కూలీ తెలుగులో రూ.45 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని ఉంది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం రూ.50 కోట్ల షేర్, రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఏదేమైనా.. ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో ఇంకొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ నుంచి నాగార్జున వంటి స్టార్ హీరో.. ఇందులో విలన్గా నటించడంతో తెలుగులో భారీ బిజినెస్ జరుపుకుందనే చెప్పాలి.

ఇకపోతే కూలీ తమిళంలో రూ.120 కోట్లు, కర్ణాటకలో రూ.30కోట్లు, కేరళతో పటు రెస్టాఫ్ ఇండియాలో రూ.25కోట్ల బిజినెస్ జరిగింది. అలాగే, ఓవర్సీస్ మార్కెట్ లో దాదాపు రూ.85 కోట్లు వచ్చాయట. ఇలా వరల్డ్ వైడ్ మొత్తం బిజినెస్ రూ.305కోట్లు అని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి లోకేష్-రజినీ మేనియా ఎలాంటి విధ్వంసం సృష్టించనుందో చూడాలి.