మొయిదీన్‌ భాయ్గా రజినీకాంత్.. లాల్ సలాం ఫస్ట్ లుక్ రిలీజ్

మొయిదీన్‌ భాయ్గా రజినీకాంత్.. లాల్ సలాం ఫస్ట్ లుక్ రిలీజ్

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "లాల్ సలామ్". తన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి రజినీ ఫస్ట్ లుక్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.  రజినీ ముస్లిం గెటప్ లో కనిపిస్తున్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది.

ఇక ఈ సినిమాలో మొయిదీన్ భాయ్‌ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు రజిని. ఇక ఈ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఐశ్వర్య.. "మొయిదీన్‌భాయ్...స్వాగతం! మీ గుండె పరుగెత్తుతున్నప్పుడు లల్‌స్లామ్ క్యాప్షన్ ఇవ్వలేరు అంటూ రాసుకొచ్చింది. ఇక సినిమాని నిర్మిస్తున్న లైకా తన ట్విట్టర్ ఖాతాలో.. మన అందరి ఫేవరెట్ భాయ్  మళ్ళీ ముంబై కి వచ్చాడు. స్వాగతం పలకండి అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

ఇక తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాలో రజినీ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడట. తమిళ హీరో విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. కొన్ని రోజుల క్రితమే పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక లేటెస్ట్ అప్డేట్ తో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కి చేరుకున్నాయి. ఎ ఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది.