
తన ఫొటోలను, మాటలను అనుమతిలేకుండా వినియోగించకూడదంటూ ప్రముఖ నటుడు రజినీకాంత్ బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. రజినీ తరఫు న్యాయవాది పబ్లిక్ నోటీస్ జారీ చేశారు. రజినీకాంత్ సెలబ్రిటీ హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన అనుమతి లేకుండా ఏవీ వాడకూడదని నోటీసుల్లో పేర్కొన్నారు. వ్యాపారపరంగా ఆయన పేరు, ఫొటోలు ఉపయోగించుకునే హక్కు కేవలం ఆయనకు మాత్రమే ఉంటుందని నోటీసుల్లో తెలిపారు.
రజినీకి ఇండస్ట్రీలో మంచి గౌరవం ఉందని, ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే దాని వల్ల ఆయనకు ఎంతో నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. ఇకపై రజినీకి సంబంధించినవి ఏవీ కూడా అనుమతి లేకుండా వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం రజినీకాంత్ .. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో జైలర్ అనే మూవీలో నటిస్తున్నారు. ఇది రజినీకి 169 వ చిత్రం కావాడం విశేషం.