OTTలో జైలర్ మేనియా.. ఏకంగా 36 దేశాల్లో దుమ్ములేపుతున్న రజినీకాంత్

OTTలో జైలర్ మేనియా.. ఏకంగా 36 దేశాల్లో దుమ్ములేపుతున్న రజినీకాంత్

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ జైలర్(jailer). అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దర్శకుడు నెల్సన్ కుమార్(Nelson kumar) తెరకెక్కించిన ఈ సినిమా ఆడియన్స్ చేత విజిల్స్ వేయించింది. ఇక తలైవర్ స్క్రీన్ ప్రెజెన్స్ కు ఫ్యాన్స్ అయితే పిచ్చెక్కిపోయారు. ఈ క్రమంలోనే జైలర్ సినిమా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన జైలర్ మూవీ.. సెప్టెంబర్ 7న ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon prime videos)లో రిలీజ్ అయ్యింది. 

Also Read :- తికమక పెడుతున్న కళ్యాణ్ రాం డెవిల్.. : రోజుకో పేరుతో ఫ్యాన్స్ అయోమయం

అయితే ఓటీటీలో కూడా జైలర్ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు అనూహ్యమైన ఆదరణ లభిస్తోంది. తాజా సమాచారం మేరకు ఏకంగా 36 దేశాలలో ఈ సినిమా ట్రెండింగులో ఉందట. థియేటర్స్ లో మాత్రమే కాకుండా, ఓటీటీలో కూడా ఈ సినిమాకు ఈ రేంజ్లో రెస్పాన్స్ రావడం ఒక రికార్డ్ గానే చెప్పుకుంటున్నారు. ఇది చూసిన రజినీకాంత్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. దేశానికే కాదు.. ప్రపంచాయనికి కూడా ఒకే ఒక సూపర్ స్టార్ అది మన రజినీకాంత్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.