
తలైవా రజనీకాంత్( Rajinikanth) నటించిన ‘జైలర్’ (Jailer) రిలీజయిన ప్రతి చోట సక్సెస్ అయింది. థియేటర్స్ లోను, ఓటీటీలోను రిలీజై సత్తా చాటింది. ఇక రీసెంట్గా దీపావళి స్పెషల్గా టీవీల్లో జైలర్ రిలీజయింది. జెమిని టీవీలో ప్రసారం అయిన జైలర్..తెలుగు ఆడియాన్స్ను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ న్యూస్ వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం.
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా జైలర్ సినిమాను జెమినీ టీవీలో ప్రసారం చేస్తే, కేవలం 5.39 టీఆర్పీ వచ్చింది. ఇది మన సూపర్ స్టార్ ఫ్యాన్స్కు షాకింగ్ నంబర్ అని చెప్పుకోవాలి. తమిళనాట మాత్రం జైలర్ కు 15.59 TRP తో బంపర్ టీఆర్పీ వచ్చింది. తెలుగులో మాత్రం ఆకట్టుకోలేకపోయింది.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. రజినీకాంత్ కెరీర్లోనే అత్యధికంగా రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. బుల్లితెర ఆడియాన్స్కు నచ్చకపోవడం వెనుక..రీసన్స్ ఏమైనా ఉండొచ్చు..కొన్ని సార్లు అంచనాలను మార్చేస్తుంటారు అంటూ సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
#Jailer Premiere TRP Ratings In Tamil, Telugu and Kannada #Rajinikanth #Shivarajkumar #Mohanlal #RamyaKrishnan #TamannaahBhatia #YogiBabu #Thalaivar170 #ThalaivarRajinikanth pic.twitter.com/aXWOtGcylf
— TAMIL TV Express™ (20K) (@TamilTvExpress) November 24, 2023
ప్రస్తుతం రజినీకాంత్ జైభీమ్ ఫేం డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తలైవా170 మూవీతో పాటుగా..లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో తలైవా171 మరో మూవీ చేస్తున్నారు. ఈ సినిమాల కోసం ఏకంగా..రజినీ రూ.270 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం. దీంతో రజినీ ఆసియాలోనే అత్యంత రెమ్యునరేషన్ తీసుకునే యాక్టర్ గా నిలుస్తాడనడంలో ఫ్యాన్స్ ఎలాంటి సందేహం లేదు.