స్వామిజీ ముందే చెప్పారు.. జైలర్ సక్సెస్పై రజని కామెంట్స్

స్వామిజీ ముందే చెప్పారు.. జైలర్ సక్సెస్పై రజని కామెంట్స్

సూపర్ స్టార్ రజనీకాంత్(Rajanikanth) హీరోగా వచ్చిన జైలర్(Jailer) మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామి సృష్టిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. నెల్సన్ కుమార్(Nelson kumar) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. ఆ అంచనాలను అధిగమిస్తూ.. వసూళ్ల వర్షం కురిపిస్తోంది జైలర్ సినిమా. 

తాజాగా జైలర్ మూవీ భారీ సక్సెస్ పై స్పందించారు రజనీకాంత్. నిజానికి జైలర్ సినిమా విడుదలకు ముందే రజనీకాంత్ ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లారు. ఇందులో భాగంగా బద్రీనాథ్‌ ఆలయాన్ని దర్శించుకున్న అయన.. అనంతరం రిషికేష్‌లోని స్వామి దయానంద గురూజీ ఆశ్రమానికి సందర్శించారు. అక్కడే రజనీ మొదటిసారి జైలర్‌ సినిమా గురించి మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఈ వీడియోలో రజని మాట్లాడుతూ.. జైలర్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఒకానొక సందర్భంలో  సినిమా ఫలితం ఎలా ఉంటుందా అని నేను కూడా అనుకున్నా. అలాంటి సమయంలో స్వామిజీ ఒక మాట అన్నారు కంగారుపడొద్దు.. సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది అని అన్నారు. స్వయంగా  స్వామీజీననే ఆ మాట చెప్పారంటే.. తప్పకుండా 'జైలర్‌' హిట్‌ అయినట్టే అని రజనీ అన్నారు.  

ప్రస్తుతం రజని చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక జైలర్ సినిమా ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో తమన్నా(Thamannaah), రమ్య కృష్ణ(Ramya krishna), యోగిబాబు(Yogibabu) ప్రధాన పాత్రలో నటించగా.. మోహన్ లాల్(Mohan lal), శివరాజ్ కుమార్(Shivraj kumar) స్పెషల్ రోల్ లో కనిపించారు.