
జైలర్ సక్సెస్తో రజనీ కాంత్ (Rajinikanth) తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టాడు.తలైవా170 మూవీ వెట్టయాన్ గా (తెలుగులో వేటగాడు) వస్తోన్న ఈ మూవీని జైభీమ్ ఫేం డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ (Tj Gnanavel) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.
ఓ పవర్ ప్యాకెడ్ థ్రిల్లర్ సినిమాను తీసుకురాబోతున్నట్లు మేకర్స్ వారి సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్టర్ రిలీజ్ చేశారు.‘మార్పు చాలా ఎక్కువ.వేట్టైయన్ ఈ సంవత్సరం 2024 అక్టోబర్లో థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని..ఎరను వేటాడానికి సిద్ధంగా ఉండు” అంటూ సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే రిలీజ్ డేట్ మాత్రం మేకర్స్ ప్రస్తావించలేదు.
ఈ పోస్టర్లో రజనీకాంత్ తనదైన స్టైల్ లో కూల్ షేడ్స్ ధరించి చేతిలో తుపాకీ పట్టుకొని చిరునవ్వుతో పలకరిస్తున్నట్లు కనపడుతున్నాడు. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ స్టైల్ అదిరిపోయింది తలైవా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ మూవీలో రజినీ పోలీస్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.రజనీకి జోడీగా దీపికా పదుకునే నటిస్తున్నట్లు టాక్.జైలర్ తో ఎలెక్ట్రిఫయింగ్ మ్యూజిక్ అందించిన అనిరుధ్ రవిచందర్ ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నారు.
దాదాపు రూ.1000 కోట్ల టార్గెట్ దిశగా రానున్నట్లు సమాచారం.ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికాసింగ్, దుషారా విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Kuri vechachu. ? VETTAIYAN ?️ is all set to take charge in cinemas ?️ this OCTOBER ?️ Get ready to chase down the prey! ??#VETTAIYAN ?️ @rajinikanth @SrBachchan @tjgnan @anirudhofficial @LycaProductions #Subaskaran @gkmtamilkumaran #FahadhFaasil @RanaDaggubati @ManjuWarrier4… pic.twitter.com/VXvhN8ZBdm
— Lyca Productions (@LycaProductions) April 7, 2024