
సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె.. నటుడు ధనుష్ సతీమణి ఐశ్వర్య తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంటరైయ్యేందుకు సిద్ధమవుతున్నారు. లైకా ప్రొడెక్షన్స్ తెరకెక్కించనున్న ఓ తెలుగు సినిమాకు ఆమె దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీకి లైకా ప్రొడక్షన్స్ నిర్మాతలుగా సుభాస్కరన్, మహావీర్ జైన్. స్ట్రెయిట్ తెలుగు సినిమా స్టోరీని సంజీవ్ రచించారు.
ఇప్పటికే లైకా ప్రొడక్షన్స్ సంస్థ ‘రామ్‌సేతు’, ‘గుడ్‌లక్ జర్రీ’ సినిమాలను నిర్మిస్తోంది. లైకా ప్రొడెక్షన్స్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందన్న ఐశ్వర్య.. ఇప్పటికే ‘3’తో దర్శకురాలిగా అభిమానుల మన్ననలు పొందారు.