తమిళనాడు రాజకీయాల్లో ఎవరూ ఊహించని విధంగా హిస్టరీ క్రియేట్ చేశారు నటుడు విజయ్. వెండితెరపై తన మేనరిజమ్స్‌తో థియేటర్లను దద్దరిల్లించిన దళపతి.. ఇప్పుడు రియల్ లైఫ్‌లో తమిళనాడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. మే 10 ఆదివారం రోజున చెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ సమక్షంలో ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా సీట్లో కూర్చున్న వెంటనే ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళల రక్షణకు స్పెషల్ వింగ్ ఫైళ్లపై సంతకాలు చేసి మొదటిరోజే రూలింగ్‌లో తన మార్క్ చూపించారు.
ద్రావిడ కోట బద్దలు..!
అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ బాక్సాఫీస్ రేంజ్‌లో పొలిటికల్ సునామీ సృష్టించింది. గత ఆరు దశాబ్దాలుగా తమిళనాడును మారుమార్చి ఏలుతున్న డీఎంకే, ఏఐఏడీఎంకే కోటలను బద్దలు కొట్టి.. తొలి ప్రయత్నంలోనే ఏకంగా 108 సీట్లను కైవసం చేసుకుంది. ఆ తర్వాత కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీల సపోర్ట్‌తో మ్యాజిక్ ఫిగర్ దాటి 120 మంది ఎమ్మెల్యేల బలంతో దళపతి గవర్నమెంట్‌ను ఫామ్ చేశారు. దీనితో లెజెండ్స్ ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత సరసన విజయ్ చేరిపోయారు.
రజనీకాంత్ రియాక్షన్..
మరో వైపు విజయ్ సీఎం అయ్యాక చెన్నై ఎయిర్‌పోర్టులో సూపర్ స్టార్ రజనీకాంత్ కు మీడియా ప్రతినిధులు ఎదురయ్యారు. విజయ్ సీఎం కావడంపై మీ కామెంట్ ఏంటి సర్? అని అడగ్గా.. రజనీకాంత్ మాటలు దాటేసి, సైలెంట్‌గా నవ్వి, చేతులు జోడించి వెళ్లిపోయారు. అయితే, మే 4న రిజల్ట్స్ వచ్చిన రోజే రజినీ ఎక్స్ వేదికగా విజయ్‌కు, టీవీకే పార్టీకి శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో 2021లో రజనీకాంత్ స్వయంగా రాజకీయ పార్టీ పెట్టాలని భావించినప్పటికీ, అనారోగ్యం కారణంగా అది 'దేవుడిచ్చిన హెచ్చరిక'గా భావించి వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే.
ప్రశంసల జల్లు..
విజయ్ సంచలన విజయంపై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విజయ్ సంచలన విక్టరీపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పందిస్తూ.. సినిమా పవర్ ఏంటో, అది సిస్టమ్‌ను ఎలా షేక్ చేయగలదో విజయ్ సర్ నిరూపించారు. ఇది కేవలం హైప్ కాదు, రియల్ పవర్ అంటూ క్రేజీ పోస్ట్ పెట్టారు. దర్శకుడు శిబి సత్యరాజ్ స్పందిస్తూ.. "జోసెఫ్ విజయ్ అనే నేను! చరిత్ర సృష్టించిన మన ముఖ్యమంత్రికి అభినందనలు" అని ట్వీట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కమల్ హాసన్ కూడా ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు
మరో వైపు రజనీకాంత్ త్వరలోనే నెల్సన్ క్రేజీ యాక్షన్-కామెడీ సీక్వెల్ 'జైలర్ 2'లో ‘టైగర్’ ముత్తువేల్ పాండియన్‌గా రాబోతున్నారు. అలాగే కమల్ హాసన్‌తో కలిసి మరో బిగ్ ప్రాజెక్ట్‌కు రెడీ అవుతున్నారు. ఏదేమైనా ‘దళపతి’ సీఎం సీట్లో కూర్చోవడం దేశవ్యాప్తంగా మోస్ట్ ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. మరి మున్ముందు తన పాలనలో విజయ్ ఎలాంటి మార్క్ చూపిస్తారో చూడాలి.
VIDEO | Chennai: Tamil Superstar Rajinikanth smiles and leaves when asked about C Joseph Vijay becoming CM.
— Press Trust of India (@PTI_News) May 12, 2026
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/t6reQ2YhjD
