
జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి చాలా కాలంగా చర్చలు నడుస్తున్నాయి. త్వరలో ఎన్టీఆర్, కొరటాల శివల సినిమాతో అది నిజమవుతోందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆ సంగతేమో కానీ బాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిపోతోంది జాన్వీ. ఆల్రెడీ గుడ్‌లక్ జెర్రీ, మిలీ, దోస్తానా 2 చిత్రాల్లో నటిస్తోంది. ఇప్పుడు మరో మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చింది. రాజ్‌కుమార్ రావ్ హీరోగా శరణ్ శర్మ డైరెక్షన్‌లో కరణ్ జోహార్ నిర్మించనున్న ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’లో ఫిమేల్ లీడ్‌గా నటించనుంది జాన్వీ. మహేందర్ పాత్రలో రాజ్‌కుమార్, మహిమ అనే క్యారెక్టర్‌లో జాన్వీ కనిపించబోతున్నారు. ఏ కలనూ ఒంటరిగా నెరవేర్చుకోవడం వీలు కాదని, ఒక కలను నెరవేర్చుకోడానికి రెండు హృదయాలు పడే తపనే ఈ సినిమా అని చెబుతున్నాడు దర్శకుడు. ఇదొక హార్ట్ వార్మింగ్ స్టోరీ అని, వచ్చే యేడు అక్టోబర్ 7న రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నామని కరణ్ చెప్పాడు. మొత్తానికి ఒకదాని తర్వాత ఒకటిగా అన్నీ మంచి ప్రాజెక్టుల్నే బ్యాగ్‌లో వేసుకుంటోంది జాన్వీ.