రష్యన్ అధికారులకు నమస్తేతో రాజ్ నాథ్ విషెస్

రష్యన్ అధికారులకు నమస్తేతో రాజ్ నాథ్ విషెస్

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రష్యా చేరుకున్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ లో ఆయన పాల్గొననున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రష్యన్ అధికారులను రాజ్ నాథ్ భారతీయ సంప్రదాయ శైలిలో నమస్తే అంటూ పలకరించడం విశేషం. మాస్కో ఎయిర్ పోర్ట్ లో రాజ్ నాథ్ ను రష్యన్ మేజర్ జనరల్ యురీ నికోలవిచ్ రిసీవ్ చేసుకున్నారు. యురీ సెల్యూట్ చేయగా.. రాజ్ నాథ్ రెండు చేతులు జోడించి నమస్తే అన్నారు. దీంతో యురీ కూడా నమస్తే అంటూ గ్రీట్ చేశారు. ఆ తర్వాత మరికొ్ంత మంది అధికారులను కలిసిన రాజ్ నాథ్.. వారిని కూడా నమస్తే అంటూ పలకరించడం గమనార్హం. ‘ఇవ్వాళ సాయంత్రం మాస్కో చేరుకున్నా. రేపు రష్యా జనరల్ సెర్గే షోయ్గూతో ద్వైపాక్షిక సమావేశం కోసం ఎదురు చూస్తున్నా’ అంటూ రాజ్ నాథ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు జతగా రష్యా అధికారులకు నమస్తే చెప్పిన వీడియోను జత చేశారు.