
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ కొత్త శకాన్ని ప్రారంభించారని, ఆయనకు శ్రీరాముడి ఆశీస్సులు ఉన్నాయని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అయోధ్య రామ మందిరం లో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం రక్షణ మంత్రి మాట్లాడారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం, శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని విప్లవాత్మక పనిగా అభివర్ణించిన రాజ్‌నాథ్.. ఈ అద్భుత క్షణాలను చూసిన వారు అదృష్టవంతులని అన్నారు. అయోధ్య వేడుకకు విపక్షాల నేతలు హాజరు కాకపోవడంపై ఆయన స్పందిస్తూ.. ‘‘నేను ఏ రాజకీయ పార్టీపైనా స్పందించాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు.