విషమించిన రాజు శ్రీవాస్తవ ఆరోగ్యం

విషమించిన రాజు శ్రీవాస్తవ ఆరోగ్యం

ప్రముఖ హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ ఆరోగ్యం మళ్లీ విషమించింది. ఢిల్లీలోని ఎయిమ్స్ చికిత్స పొందుతున్నారు. 15 రోజుల పాటు వెంటిలెటర్ పై ఉన్న ఆయన ఏడు రోజుల క్రితం స్పృహలోకి వచ్చారు. సెప్టెంబర్ 1వ తేదీన .. 100 డిగ్రీల జ్వరం రావడంతో మళ్లీ వెంటిలెటర్ పై చికిత్స కొనసాగుతోంది. స్పృహలోనే ఉన్నట్లు చేతులు, కాళ్లు కదలికలున్నట్లు రాజు పీఆర్వో వెల్లడించారు. ఆగస్టు 10వ తేదీన జిమ్ లో వర్కవుట్ చేస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయన్ను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆగస్టు 25వ తేదీన రాజు స్పృహలోకి వచ్చారు. ఈ విషయాన్ని పీఆర్వో అజిత్ సక్సేనా ధృవీకరించారు.

శ్రీవాత్సవ త్వరగా కోలుకునేలా ప్రార్థనలు చేయాలంటూ రాజు సన్నిహితుడు సునీల్ పాల్ ఓ వీడియో పోస్ట్ చేశారు. రాజు శ్రీవాస్తవ ప్రముఖ హాస్య నటుడు. అనేక కామెడీ షోలు నిర్వహించారు. దేశంలోని ఫేమస్ స్టాండ్ అప్ కమెడియన్లలో ఒకరిగా నిలిచారు. సెలబ్రెటీలను, రాజకీయ నాయకులను ఇమిటేట్ చేయడంలో రాజు దిట్ట. ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్, కామెడీ సర్కస్, ది కపిల్ శర్మ షో, శక్తిమాన్ ఇతర షోలు పాపులర్ అయ్యారు. మైనే ప్యార్ కియా, తేజాబ్, బాజీగర్ వంటి పలు బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించారు. ఇండియా లాఫ్టర్ ఛాంపియన్ షోలో ప్రత్యేక అతిథిగా శ్రీవాస్తవ కనిపించారు. హిందీ బిగ్ బాస్ సీజన్ 3లోనూ పాల్గొన్నాడు.