
డిఫరెంట్ కాన్సెప్టులు సెలెక్ట్ చేసుకుంటున్న శర్వానంద్ గత శుక్రవారం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అంటూ ప్రేక్షకులను పలకరించాడు. ఇప్పుడు నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టాడు. కొరియోగ్రాఫర్‌గా వందల సినిమాలకు డ్యాన్స్ కంపోజ్ చేసిన రాజు సుందరం దర్శకత్వంలో నటించేందుకు శర్వా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. శర్వాతో పలు సినిమాల్లో స్టెప్స్ వేయించిన రాజు సుందరం ఇప్పుడు అతన్ని డైరెక్ట్ చేయడానికి సిద్ధమయ్యాడట. చాలా రోజుల క్రితమే శర్వానంద్‌తో పాటు యూవీ క్రియేషన్స్ వారికి స్టోరీ వినిపించాడట రాజు. అయితే శర్వా వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో కుదరలేదు. ఇప్పుడు ఆయన డేట్స్ దొరకటంతో వీలైనంత ఫాస్ట్‌గా ఈ చిత్రాన్ని సెట్స్‌కి తీసుకెళ్లాలనుకుంటోంది యూవీ క్రియేషన్స్ సంస్థ. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని సమాచారం. ఇదే కనుక నిజమైతే రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్‌గా శర్వా, యూవీ కాంబోలో ఈ చిత్రం తెరకెక్కనుంది. అలాగే తమిళంలో ‘ఏగం’ సినిమాతో దర్శకుడిగా మారిన రాజు సుందరం ఈ మూవీతో తెలుగులోనూ డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అవుతాడు.