ప్రధాని పదవికి మోదీ అనర్హుడు: కపిల్​ సిబల్​

ప్రధాని పదవికి మోదీ అనర్హుడు: కపిల్​ సిబల్​

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి పదవికి నరేంద్ర మోదీ అనర్హుడని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ అన్నారు. ఇండియా కూటమిని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్లను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. ప్రధాని పదవిలో ఉంటూ ఇలాగేనా మాట్లాడేదని మండిపడ్డారు. ముస్లిం ఓట్ల కోసం ఇండియా కూటమి అవసరమైతే ముజ్రా డ్యాన్స్ కూడా చేస్తదన్న మోదీ కామెంట్లపై కపిల్ సిబల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కామెంట్లు ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధమని అన్నారు. ‘‘ఇండియా కూటమి ప్రజల నుంచి వాటర్ ట్యాప్​లు, కరెంట్, బ్యాంకుల నుంచి డబ్బులు గుంజుకుంటదని మోదీ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నరు.

ప్రధాని కుర్చిలో ఉన్న వ్యక్తి ఇలాగే మాట్లాడుతారా? పీఎం పోస్ట్​కు ఉన్న గౌరవాన్ని దిగజార్చుతున్నరు. సోషల్ మీడియాలో మీ గురించి ఏం అనుకుంటున్నారో చూడండి. ముజ్రా డ్యాన్స్ అంటూ కామెంట్లు చేయడం.. మహిళలతో పాటు అపోజిషన్ లీడర్లను కించపర్చడమే అవుతుంది. ఇలాంటి కామెంట్లుతో సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నరు? ఇలాంటి కామెంట్లు చేస్తూ వికసిత్ భారత్ లక్ష్యాన్ని ఎలా చేరుకుందామనుకుంటున్నరు?’’ అని మోదీని కపిల్ సిబల్ నిలదీశారు.