రాఖీలు కట్టి.. దీవెనార్తి పెట్టి.. సిటీలో ఘనంగా రక్షాబంధన్

రాఖీలు కట్టి.. దీవెనార్తి పెట్టి.. సిటీలో ఘనంగా రక్షాబంధన్

వెలుగు, నెట్​వర్క్: సిటీలో శనివారం రాఖీ పండుగ ఘనంగా జరిగింది. అన్నదమ్ములకు అక్కాచెల్లెళ్లు రాఖీ కట్టి దీవించారు. రాజ్​భవన్​లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు వీహెచ్​పీ, మాతృశక్తి, దుర్గావాహిని నాయకులు రాఖీ కట్టారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతోపాటు కంటోన్మెంట్​ఎమ్మెల్యే శ్రీగణేశ్​కు బల్దియా కార్మికులు రాఖీ కట్టి ఆశీర్వదించారు.

 నగర మేయర్ విజయలక్ష్మి పలువురు ముస్లింలకు రాఖీ కట్టి మత సామరస్యం చాటారు. హైదరాబాద్ కలెక్టర్ హరిచందన యూసఫ్​గూడలోని శిశు విహార్​లో వేడుకలు చేసుకున్నారు. చిన్నారులకు రాఖీలు కట్టి, బహుమతులు అందజేశారు.  గాంధీ దవాఖానలో డాక్టర్లు, సిబ్బందికి జనహిత సేవా ట్రస్ట్, వాత్సల్య సింధు ఆశ్రమం, వైదేహి ఆశ్రమానికి చెందిన చిన్నారులు రాఖీలు కట్టారు. రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.