మీ బాయ్ ఫ్రెండ్కి రిజైన్ చేయమని చెప్పండి ప్లీజ్.. మెలోని వీడియోకు రాఖీ సావంత్ కామెంట్

మీ బాయ్ ఫ్రెండ్కి రిజైన్ చేయమని చెప్పండి ప్లీజ్.. మెలోని వీడియోకు రాఖీ సావంత్ కామెంట్

రాఖీ సావంత్ పేరు వినే ఉంటారు. మల్లికా షెరావత్, రాఖీ సావంత్.. ఈ ఇద్దరూ ఒకప్పుడు బాలీవుడ్లో ఐటమ్ సాంగ్స్కు పెట్టింది పేరు. అందాల ఆరబోతలో ఏమాత్రం వెనకడుగు వేయని ఐటమ్ బాంబ్ రాఖీ సావంత్. ఇన్స్టాగ్రాంలో రాఖీ సావంత్కు ఏకంగా 14 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. పలు సందర్భాల్లో.. వివాదాస్పద పోస్టులకు, వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన ఈ బాలీవుడ్ హాట్ బాంబ్ ఇప్పుడు మరో కామెంట్తో వైరల్ అయింది.

ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి పరోక్షంగా ఆమె చేసిన కామెంట్ నెట్టింట హాట్ టాపిక్ అయింది. CJP నిరసనకు మద్దతు ప్రకటించిన రాఖీ సావంత్.. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని వీడియో కింద చేసిన కామెంట్ ఏంటంటే.. ‘‘మీ బాయ్ ఫ్రెండ్కి రిజైన్ చేయమని చెప్పండి ప్లీజ్.. దయచేసి రిజైన్ చేయమని మీరైనా అడగండి’’ అని కామెంట్ చేశారు.

రాఖీ సావంత్ ఈ కామెంట్ ఎవరిని ఉద్దేశించి చేసిందో ఈపాటికే అర్థమై ఉంటుంది. మోదీ, మెలోని మీట్ అయిన ప్రతీ సందర్భంలో వీడియోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు రెండు దేశాల ప్రధాన మంత్రులు అనే సంగతి తెలిసి కూడా.. మీమర్స్.. ఇన్ స్టా, ఎక్స్లో ఈ ఇద్దరికి లవ్ ట్రాక్ ఆపాదించి ఫొటోలు, వీడియోలతో రచ్చ లేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాఖీ సావంత్ కూడా ఇలా కామెంట్ చేయడంతో మరోసారి మెలోని, మోదీ ఫొటోలు, వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి.