
న్యూఢిల్లీలోని తన నివాసంలో పిల్లలతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ రక్షా బంధన్‌ను జరుపుకున్నారు. విద్యార్థినీలు మోడీకి రాఖీ కట్టారు. కాసేపు పిల్లలతో గడిపారు మోడీ. ఓ చిన్నారి మోడీ చెంపపై ముద్దు పెట్టింది. పిల్లలు పద్యాలు , పాటలు కూడా పాడారు. పిల్లల పేర్లు, క్లాస్ అడిగి తెలుసుకున్నారు మోడీ. స్కూల్ టీచర్లతో గ్రూప్ ఫోటో దిగారు మోడీ. ఈ వీడియో, ఫోటోలు ఇపుడు వైరల్ అవుతున్నాయి.
#WATCH | School girls tie Rakhi to Prime Minister Narendra Modi in Delhi, as they celebrate the festival of #RakshaBandhan with him. pic.twitter.com/Hhyjx63xgi
— ANI (@ANI) August 30, 2023
ఇటీవల చంద్రయాన్-3 మిషన్ విజయవంతం కావడం.. త్వరలో సూర్యూడిపై ప్రయోగించే ఆదిత్య L-1 మిషన్ గురించి ప్రస్తావించారు. ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వ పథకాలతో పాటు పలు అంశాలపై పద్యాలు రచించాలని మోడీ ప్రోత్సహించారు.
#WATCH | Prime Minister Narendra Modi celebrated #RakshaBandhan with children at 7, Lok Kalyan Marg in Delhi today. pic.twitter.com/reXvBDHr40
— ANI (@ANI) August 30, 2023
అంతకుముందు మోదీ ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. సోదరీ సోదరుల మధ్య విడదీయరాని విశ్వాసం, ప్రేమకు అంకితమైన పవిత్రమైన రక్షాబంధన్ పండుగని అన్నారు. భారతీయ సంస్కృతికి పవిత్ర ప్రతిబింబం రాఖీ పండుగ అని ట్వీట్ చేశారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆప్యాయత, సామరస్య భావాన్ని పెంపొందించాలని ప్రధాన మంత్రి ఆకాంక్షించారు.