ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్‌లోని రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం టౌన్‌లోని విద్యా హైస్కూల్లో ఏర్పాటు చేసిన అవ్వకు బువ్వ ప్రోగ్రాంలో 63 మంది నిరుపేద వృద్ధులకు 5 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ ఖాందేశ్ మాట్లాడుతూ.. రక్షా స్వచ్చంద సేవా సంస్థ తరపున రాబోయే రోజుల్లో మరిన్ని సేవాకార్యక్రమాలు చేస్తామని, త్వరలో హెల్త్ క్యాంపు నిర్వహిస్తామని చెప్పారు.
కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్, ఉపాధ్యక్షుడు జిందం నరహరి, ఎస్జి శ్రీకాంత్, కోశాధికారి గోనె శ్రీధర్, కార్యనిర్వహక కార్యదర్శులు బేతు గంగాధర్, తులసి పట్వారి, ఖాందేశ్ సత్యం, సభ్యులు మక్కల సాయినాథ్, గోక శరత్, నరేశ్, ఖోడే శ్రీనివాస్, విష్ణు, చైతన్య, మహేశ్, రాజశేఖర్, కల్యాణ్, మేతాబ్ సింగ్, రాజేశ్, సంజీవ్ పాల్గొన్నారు.
