
నవీన్ బేతిగంటి, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘రాక్షస కావ్యం’. శ్రీమాన్ కీర్తి దర్శకత్వంలో దామురెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మిస్తున్నారు. గురువారం ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ‘బలగం’ దర్శకుడు వేణు, హీరో తిరువీర్ అతిథులుగా హాజరయ్యారు. వేణు మాట్లాడుతూ ‘టీజర్ చూస్తే.. సినిమాలో ఏదో కొత్తదనం ఉండబోతోందని తెలుస్తోంది.
ఇలాంటి ప్యాషనేట్ టీమ్‌ను ఎంకరేజ్ చేయాలి’ అన్నాడు. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటూ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పాడు తిరువీర్. నవీన్ మాట్లాడుతూ ‘ఇదొక డిఫరెంట్ మూవీ. నటుడిగా నా లైఫ్ టైమ్‌లో గుర్తుండే సినిమా అవుతుంది’ అన్నాడు.
అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పారు హీరోయిన్స్ కుశాలిని, రోహిణి. పురాణాల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం అన్నాడు శ్రీమాన్ కీర్తి. ఇదొక డార్క్ కామెడీలా అనిపించినా.. మంచి హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి అన్నారు నిర్మాత దాము రెడ్డి. నటులు యాదమ్మ రాజు, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, మ్యూజిక్ డైరెక్టర్ రాజీవ్ రాజ్, లిరిక్ రైటర్ మిట్టపల్లి సురేందర్ పాల్గొన్నారు.