Sasivadane Trailer: ఆడపిల్లలు కోరికలు, ఆశలతోనూ రారు.. భరోసాతో వస్తారు.. మనసుని హత్తుకునే డైలాగ్స్తో శశివదనే

Sasivadane Trailer: ఆడపిల్లలు కోరికలు, ఆశలతోనూ రారు.. భరోసాతో వస్తారు.. మనసుని హత్తుకునే డైలాగ్స్తో శశివదనే

‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి, హిట్ 3 ప్రాంచైజీల్లో మెరిసిన కోమలీ జంటగా నటించిన మూవీ ‘శశివదనే’. సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెకెక్కింది. అక్టోబర్ 10న సినిమా విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఇవాళ (సెప్టెంబర్ 29న) మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్లో రక్షిత్, కోమలి కెమిస్ట్రీ బాగుంది. హీరోహీరోయిన్స్‌‌‌‌ మద్య వచ్చే లవ్ సీన్స్ మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. ‘ఒక్క చూపుతో ప్రేమ మొదలైంది.. కాలం బొమ్మలా ఆగిపోయింది.. ఆమెతో పాటే నా మనసు కూడా మాయమైంది’ అనే డైలాగ్తో ట్రైలర్ స్టార్ట్ అయ్యి.. ఆద్యంతం ఆసక్తిగా సాగింది.

‘నా ఊరిలోకి వస్తే.. నా జీవితంలోకి వచ్చిన్నట్టే..’ ‘ఆడపిల్లలు మన జీవితంలోకి కోరికలతోనో, ఆశలతోనూ రారురా.. జీవితంలో తోడుగా ఉంటామని భరోసాతో వస్తారు..మనతో చెయ్యట్టుకుని ఏడడుగులు నడుస్తారు.. ఒక్కసారి ప్రేమించాలని డిసైడ్ అయితే.. ఎన్నొచ్చినా యుద్ధం చేయాల్సిందే ’

►ALSO READ | Bigg Boss 9 Elimination: డాక్టర్ పాప 3 వారాలకే ఎలిమినేట్.. కారణం అదేనంటా..! ఎన్ని లక్షలు సంపాదించిందంటే?

ఇప్పటికీ శశివదనే నుంచి కొన్ని డైలాగ్స్ పాపులర్ అయ్యాయి. ‘హృదయాలు కలిసే చోట, ప్రేమకథలు వికసించే చోట..’,  ‘మనసులో పుట్టే ప్రేమ మచ్చలేనిదైతే ఆ ప్రేమకు మరణం కూడా మనతోనే’ అనే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే, ఇందులో ప్రేమకథ మాత్రమే కాకుండా ఊహించని ట్విస్ట్‌‌‌‌ ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

ఈ మూవీలో శ్రీమాన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. శరవణ వాసుదేవన్ సంగీతం, అనుదీప్ దేవ్‌‌ బ్యాక్ గ్రౌండ్ సంగీతం అందించారు.

శశివదనే హీరోయిన్ కోమలీ ప్రసాద్.. తెలుగులో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. నెపోలియన్, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, సెబాస్టియన్, రౌడీ బాయ్స్, హిట్ 2, హిట్ 3 ప్రాంచైజీల్లో నటించి ఆర్టిస్ట్‌‌గా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి. అయితే, ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌‌గా ఉంటుంది. తరుచూ తన కొత్త ఫొటోస్ పబ్లిష్ చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటుంది కోమలీ.