
యువ కథానాయకుడు రక్షిత్ అట్లూరి, గ్లామరస్ నాయిక కోమలి ప్రసాద్ జంటగా నటించిన ఆసక్తికర చిత్రం 'శశివదనే' విడుదలకు సిద్ధమైంది. రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్‌వీఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మించారు. గౌరీ నాయుడు సమర్పిస్తున్నారు.
గోదావరి టచ్ తో కూడిన కథ
శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర బృందం సినిమా విశేషాలను పంచుకుంది. తండ్రీ-కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ తెలుగులో ఇప్పటివరకు రాని విధంగా ఉంటాయని హీరో రక్షిత్ అట్లూరి తెలిపారు. ఈ చిత్రంలోని శ్రీమాన్ పాత్ర ఖచ్చితంగా అందరికీ గుర్తుండిపోతుంది అనిధీమా వ్యక్తం చేశారు. గోదావరి జిల్లాల అందాలను అద్భుతంగా చిత్రీకరించిన కెమెరామెన్ సాయి కుమార్, యువ సంగీత దర్శకుడు శర్వా అందించిన సంగీతం, అనుదీప్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచాయని అన్నారు. తమ సినిమా ఏమాత్రం అశ్లీలత లేకుండా, నిజాయితీతో కూడిన ఒక మంచి చిత్రమని, ప్రేక్షకులు థియేటర్ నుంచి తప్పకుండా ఆనందంతో బయటకు వస్తారని రక్షిత్ హామీ ఇచ్చారు.
ఇండస్ట్రీకి రావాలనేది మా నాన్న కల. నా రచనను నమ్మి అద్భుతమైన విజువల్స్ ఇచ్చిన సాయి కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు దర్శకుడు సాయి మోహన్. కోమలి ప్రసాద్ నా అంచనాలకు మించి నటించారు. శ్రీమాన్ సింగిల్ షాట్ సీన్ హైలైట్‌గా నిలుస్తుంది" అని తెలిపారు.
►ALSO READ | Rakshit Shetty: ఆనందంలో రష్మిక మాజీ ప్రియుడు.. వారికి థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ !
'శశివదనే' తన కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన చిత్రమని, తన పాత్ర కూడా చాలా కొత్తగా ఉంటుందని హీరోయిన్ కోమలి చెప్పారు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులను ఊహించని విధంగా సర్‌ప్రైజ్ చేస్తుందని, ఈ ఎమోషనల్ రైడ్‌ను అందరూ థియేటర్‌లో చూడాలని కోరారు. రొమాన్స్, ఫ్యామిలీ విలువలు కలగలిసిన ఈ చిత్రం అక్టోబర్ 10న తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధంగా ఉంది. మరి థియేటర్ లో ప్రేక్షకులను ఈ మూవీ ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.