
భారీ సినిమాలు, అదిరిపోయే కలెక్షన్స్.. మాట వినబడితే..బాలీవుడ్ అనే రోజులు పోయాయి. తెలుగు సినిమాల సత్తా ఇంటర్నేషనల్ వైడ్ గా కలెక్షన్స్ తోను, భారీ నిర్మాణంతోనూ దూసుకెళ్లాయి. అలాగే కన్నడ సినిమాలు కూడా కె.జి.యఫ్ మూవీతో మొదలై..చిన్న సినిమాల వరకు వందల కోట్లు వసూళ్లు నమోదు చేస్తున్నాయి.
రీసెంట్ గా కన్నడ హీరో రక్షిత్ శెట్టి (Rakshit Shetty) హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం సప్త సాగరాలు ఎల్లో (సైడ్ ఏ). అక్కడ సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని సప్త సాగరాలు దాటి (Sapta Sagaralu Dhaati Side A ) పేరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ మూవీకి తెలుగులో ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. .ఇప్పుడు ఈ సినిమాకు సప్త సాగరాలు దాటి సైడ్ బి(Sapta Sagaralu Dhaati Side B) సీక్వెల్ తెరకెక్కింది. ఇవాళ నవంబర్ 17 న థియేటర్లో రిలీజైన ఈ మూవీ ప్రేమ సాగరాలను దాటిందా? లేదో చూద్దాం.
కథ :
సప్త సాగరాలు (సైడ్ ఏ) మూవీలో హీరో హీరోయిన్ల యాక్టింగ్, మ్యూజిక్ రెండింటిని వేరు చేసి చూడలేం. మొత్తం పాటలు మనల్ని తెరపై ప్రపంచంలోకి తీసుకు వెళ్లాయి. నేపథ్య సంగీతం థియేటర్ నుంచి వచ్చిన తర్వాత కూడా మనల్ని వెంటాడేలా చేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ లో నేపథ్య సంగీతం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. ఇక సినిమా చూసిన ప్రతీ ఒక్కరు హార్డ్ టచింగ్ సినిమా అని, గుండెల్ని పిండేసే సినిమా అని..(సైడ్ ఏ) కి రివ్యూల ప్రశంసలు కురిసాయి .
మొదటి పార్ట్ (సైడ్ ఏ)లో ఎక్కడ కథను ముగించారో..అక్కడే మొదలవుతుంది సైడ్ బి. మను..ప్రియా జంట ప్రేమించుకుని... ఆ ప్రేమని నిలబెట్టుకునేందుకు చివరి వరకు పోరాడి..విధి ముందు ఓడిపోయిన ప్రేమికులుగా మిగిలిపోవడం ఫస్ట్ పార్ట్ లో చూసేసాం. ఆ తర్వాత ప్రియకు వేరొక వ్యక్తితో పెళ్లవ్వడం..మను జైలుకి వెళ్లడంతో ఫస్ట్ పార్ట్ ముగిసింది.
ఇక (సైడ్ బి ) స్టోరీ విషయానికి వస్తే..మను (రక్షిత్ శెట్టి) పదేళ్ల శిక్ష తర్వాత 2021లో జైలు జీవితం పూర్తి చేసుకుని బయటికి వస్తాడు. బయటికి రాగానే ప్రియ (రుక్మిణీ వసంత్) అడ్రస్ తెలుసుకోవాలని ప్రయత్నాలు చేసే క్రమంలో..సురభి (చైత్ర జె.ఆచార్) పరిచయం అవుతుంది. అలా సురభి హెల్ప్ తీసుకుంటాడు మను.
ఇక ఆ తర్వాత మను ప్రియను కలిశాడా? పదేళ్ల తర్వాత కూడా ప్రియ..మనుని మరిచిపోకుండా ఉందా? అసలు ఇంతకీ సురభి ఎవరు? తనని ఎందుకు పరిచయం అవ్వాల్సి వచ్చింది? అలాగే మను జీవితం జైలులోనే మగ్గిపోవడానికి కారణమైన వాళ్లపై రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు? మను చివరికి ప్రియను కలిసాడా? అనేది తెలియాలంటే థియేటర్లో ఈ మూవీ చూడాల్సిందే.
ఎలా ఉందంటే :
సైడ్ ఏ సినిమా ఎలా కదిలించిందో..సైడ్ బి కూడా ఎంతో ఎమోషనల్‌గా ఉందని..గుండెకు టచ్ అయ్యే సీన్స్ చాలానే ఉన్నట్లు థియేటర్స్ నుంచి బయటికి వచ్చే ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు.
ఈ సినిమా ఫస్ట్ పార్ట్ తగ్గట్టుగా..ప్రేమను చూపిస్తూనే..అందులో వచ్చే భావోద్వేగాలు..అలాగే ప్రతీకార కోణాన్నీసైడ్ బి లో చూపించారు. మను..ప్రేమించిన అమ్మాయి క్షేమం కోసం..ఆమె కన్న కలల కోసం..ఎప్పుడు ఆలోచించే ప్రేమికుడిగా కథనం సాగుతూ ఉంటుంది. మను జైలు జీవితం గడపడానికి ..కారకులైన ప్రతి ఒక్కరిపై రివెంజ్ తీర్చుకుంటాడు.ఇక ఇందులో అక్కడక్కడా స్లో నేరేషన్ తో సాగే సన్నివేశాలు ఉన్నప్పటికీ, బోర్ కొట్టించకుండా..భావోద్వేగాలు కట్టిపడేసేలా చేయడంలో వచ్చిన స్క్రీన్ ప్లే అదిరిపోతుంది.
ప్రేమించిన ప్రియ జీవితాన్ని..దూరం నుంచి చూస్తూనే తపనపడే ప్రేమికుడిలా..ప్రేమించిన అమ్మాయి జీవితాన్నికి ఏ ఆటంకం రాకుండా..చక్కబెట్టేందుకు మను ప్రయత్నించే సీన్స్ లో ప్రేమలోని గొప్పదనం తెలిసేలా హేమంత్ కథనం నడిపించాడు. అలాగే మను,సురభి మధ్య వచ్చే సీన్స్ చాలా స్పెషల్ గా తెరకెక్కించాడు.సైడ్-ఎ సముద్రంలోని ప్రశాంతమైన కోణాన్ని తెలియజేస్తే..సైడ్-బి అందులోని అలజడి కోణాన్ని చూపించడంలో సక్సెస్ అయింది.
ఎవరెలా చేశారంటే:
హీరో రక్షిత్ శెట్టి నటన నెక్ట్స్ లెవెల్లో ఉందని, రుక్మిణి, చైత్రలు అద్భుతంగా నటించారని థియేటర్స్ లో ఆడియాన్స్ అంటున్నారు. ఈ మూవీ ప్రేమ యాంగిల్ ఉన్న ప్రతి ఒక్కరి వెంట చాన్నాళ్లు ఉండేలా నటించారు. ఇలాంటి ఇంటెన్స్ సినిమాను ఇచ్చిన హేమంత్‌కు థాంక్స్ చెప్పుకోవాల్సిందే. హృదయాన్ని వెంటాడే కథతో సినిమా చేయడమంటే..చాలా సాహసం చేసి ఉండాలి. అంతకంటే ఎక్కువగా అనుభవించి ఉండాలి. కన్నడ సినిమాల్లో ఇది ఎప్పటికీ నిలిచిపోతుందని సినీ క్రిటిక్స్ మాట్లాడుకుంటున్నారు. కల్ట్ క్లాసిక్..ఇలాంటి సోల్ ఫీల్ మూవీని అస్సలు మిస్ అవ్వకుండా థియటర్స్ లో చూడాల్సిందే.
సాంకేతిక నిపుణులు :
సప్త సాగరాలు (సైడ్ ఏ) మూవీలో హీరో హీరోయిన్ల యాక్టింగ్, మ్యూజిక్ రెండింటిని వేరు చేసి చూడలేం. చరణ్‌రాజ్ మ్యూజిక్ మనల్ని తెరపై ప్రపంచంలోకి తీసుకు వెళ్లాయి. నేపథ్య సంగీతం థియేటర్ నుంచి వచ్చిన తర్వాత కూడా..మనల్ని వెంటాడేలా చేస్తోంది. సునీల్ భరద్వాజ్ ఎడిటింగ్ బాగుంది. రచన-దర్శకత్వం చేసిన హేమంత్ హృద్యమైన ప్రేమగాథని..గాఢమైన భావోద్వేగాలతో తెరపైకి తీసుకు రావడంలో సక్సెస్ అయ్యాడు. ప్రొడ్యూసర్స్ నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.