భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్: 7 రోజులు దివ్యానుగ్రహ విశేష హోమం ఆన్‎లైన్ టికెట్లు రద్దు

భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్: 7 రోజులు దివ్యానుగ్రహ విశేష హోమం ఆన్‎లైన్ టికెట్లు రద్దు

తిరుమల: భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. అలిపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆన్ లైన్ టికెట్లు వారం రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. 2025,సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఆన్ లైన్ టికెట్లు అందుబాటులో ఉండవని భక్తులకు సూచించింది. హోమం ప్రాంతంలో అడ్డుగా ఉన్న చెట్లు తొలగింపు, నవనీకరణ తదితర కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది.

 సెప్టెంబర్  నెలలో 7 రోజులు మినహా మిగిలిన రోజులలో ఆన్ లైన్‎లో విశేష హోమం టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం (సెప్టెంబర్ 2) టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. 

►ALSO READ | అమరావతి భూసేకరణకు సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్.. 18 వందల ఎకరాల సేకరణకు ఏపీ సర్కార్ ప్లాన్..