పుతిన్ డైనమిక్ లీడర్: భారత్-రష్యా సంబంధాలపై పాక్ పీఎం కీలక వ్యాఖ్యలు

పుతిన్ డైనమిక్ లీడర్: భారత్-రష్యా సంబంధాలపై పాక్ పీఎం కీలక వ్యాఖ్యలు

బీజింగ్: భారత్-రష్యా సంబంధాలపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-రష్యా మధ్య సంబంధాలు చాలా బాగున్నాయని, ఆ రెండు దేశాల రిలేషన్‎షిప్‎ను పాకిస్తాన్ గౌరవిస్తోందన్నారు షరీఫ్. రష్యా అధ్యక్షుడు పుతిన్ డైనమిక్ లీడర్ అని కొనియాడారు. బీజింగ్‌లో జరిగిన SCO శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‎తో మంగళవారం (సెప్టెంబర్ 2) ముఖాముఖి భేటీ అయ్యారు షరీఫ్. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘భారతదేశంతో మీ సంబంధాన్ని మేము గౌరవిస్తాం. మీ రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా బాగున్నాయి. మేం కూడా రష్యాతో బలమైన సంబంధాలను నిర్మించాలనుకుంటున్నాం. పాక్-రష్యా మధ్య సంబంధాలు ఈ ప్రాంత పురోగతి, శ్రేయస్సుకు అనుబంధంగా అభినందనీయంగా ఉంటాయి’’ అని అన్నారు. పుతిన్ డైనమిక్ లీడర్ అని కొనియాడిన షరీష్.. ఆయనతో కలిసి పని చేయడానికి  సంసిద్ధత వ్యక్తం చేశారు.

చైనా వేదికగా జరిగిన SCO శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని మోడీ, పాక్ పీఎం షెహబాజ్ షరీఫ్ తదితర దేశాధినేతలు హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ఉల్లాసంగా మాట్లాడుకున్నారు. శిఖరాగ్ర సమావేశం తర్వాత ఇద్దరు నాయకులు ఒకే కారులో తమ ద్వైపాక్షిక సమావేశ వేదికకు కలిసి ప్రయాణించారు.

►ALSO READ | పాక్‌తో ఫ్యామిలీ బిజినెస్ కోసమే ట్రంప్ భారత్‌ను పక్కన పెట్టాడు: జేక్ సుల్లివన్

భేటీ అనంతరం.. పుతిన్‎ను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుందని మోడీ ట్వీట్ చేశారు. అయితే.. SCO సమ్మిట్ వేదిక దగ్గర ఫొటో షూట్ కార్యక్రమం సందర్భంగా ప్రధాని మోడీ, పుతిన్ మాట్లాడుకుంటూ వెళ్తూ పాక్ పీఎం షెహబాజ్ షరీఫ్‎ను కనీసం పట్టించుకోలేదు. పాక్ పీఎం బాడీగార్డ్‎లా ఓ పక్కన నిల్చున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‏గా మారింది.