Samantha : రాజ్‌తో సమంత ప్రేమాయణం.. బయటపడ్డ దుబాయ్ వీడియో..!

 Samantha : రాజ్‌తో సమంత ప్రేమాయణం.. బయటపడ్డ దుబాయ్ వీడియో..!

క్యూట్ బ్యూటీ సమంత రూత్ ప్రభు మరో సారి వార్తల్లో నిలిచారు. దుబాయ్ ఫ్యాషన్ వీక్ పాల్గొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అయితే ట్రిప్ లో ఓ వ్యక్తి చేయి పట్టుకుని ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ గా మారింది. అభిమనులకు అనేక సందేహాలను రేకెత్తిస్తోంది. ఆ చేతిని చూసి అది 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ దర్శకుడు రాజ్ నిడిమోరుదేనని నెటిజన్లు కనిపెట్టారు.  ఈ వీడియో ఉన్నది ఎవరో  మాకు కావాల్సిన కన్ఫర్మేషన్ అంటూ కామెంట్ల వర్షం కురిపించారు.

కొత్త పార్టనర్ ను పరిచయం చేస్తున్నారా?..
అయితే ఈ వీడియోలో వారి ముఖాలు స్పష్టంగా కనిపించలేదు. కానీ రాజ్ చేతికి ఉన్న బ్రాస్‌లెట్ గతంలో ఆయన ధరించిన బ్రాస్‌లెట్ ఒకటే అని అభిమానులు ఈ నిర్ణయానికి వచ్చారు. మీరు మీ కొత్త పార్టనర్ ను పరిచయం చేస్తున్నారా.. ?  కన్ఫర్మేషన్ ఇవ్వండి.. మీరు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం .. అంటూ పోస్ట్ చేస్తున్నారు అభిమానులు.  అంతే కాకుండా సమంత పోస్ట్ చేసిన వీడియోకు, ఆమె 'సిటాడెల్' కో-స్టార్ వరుణ్ ధావన్ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేయడంతో మరింత ఆసక్తి నెలకొంది.

రాజ్- సమంత బంధంపై ఊహాగానాలు..
 రాజ్, డీకే కృష్ణన్ దర్శకత్వంలో రూపొందిన 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ తర్వాత సమంత, రాజ్ ఇద్దరూ అనేక సందర్భాల్లో కలిసి కనిపించారు. దీనితో వీరి సంబంధంపై పలు ఊహాగానాలు మొదలయ్యాయి. చాలా మంది అభిమానులు, సమంత తన ప్రేమ జీవితాన్ని నెమ్మదిగా పబ్లిక్‌గా పరిచయం చేస్తోందని అభిప్రాయపడుతున్నారు. అయితే, సమంత గానీ, రాజ్ గానీ ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 'సిటాడెల్' వెబ్ సిరీస్ ఇండియన్ స్పిన్-ఆఫ్‌లో కలిసి పనిచేసినప్పటి నుండి వీరిద్దరూ మరింత దగ్గరయ్యారని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

సమంత కొత్త రూల్స్
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు నేను చాలా సినిమాలు,  వెబ్  సిరీస్‌లలో భాగమయ్యాను. కానీ, అవన్నీ నాకు ఇష్టమైనవి కావు. కానీ ఇప్పుడు నేను చేసే ప్రతి పని, నేను పెట్టుబడి పెట్టే ప్రతి వ్యాపారం, నేను నిర్మించే ప్రతి సినిమా నా మనసుకు నచ్చినవి అని తెలిపింది.  ఒకేసారి ఐదు సినిమాలు చేయలేను. అందుకే నేను చేసే పనిని తగ్గించాను. కానీ ఇప్పడు చేసే ప్రతి పనికీ, నేను పెట్టే ప్రతి శ్రమకి ఎంతో విలువ ఉందని చెప్పుకొచ్చింది. 

వృత్తిపరంగా సమంత తన కంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని ముందుకు సాగుతోంది.  ఇటీవల 'శుభం' సినిమాలో అతిథి పాత్రలో నటించింది. ఈ చిత్రాన్ని ఆమె స్వయంగా నిర్మించారు. ప్రస్తుతం ఆదిత్య రాయ్ కపూర్ తో కలిసి 'రక్త బ్రహ్మాండ్ : ది బ్లడీ కింగ్ డమ్ ' అనే వెబ్ సీరిస్ లో నటిస్తోంది. ఇందులో వామికా గబ్బి, అలీ ఫజల్ కీలక పాత్రలో కనిపించనున్నారు.  అయితే సమంత తన ప్రేమ జీవితం గురించి అధికారికంగా ప్రకటించకపోయినా..  ఆమె అభిమానులు మాత్రం ఆ శుభవార్త కోసం ఎంతో అతృతగా ఎదురుచూస్తున్నారు. మరి రాజ్ తో తన బంధాన్ని ఎప్పుడు బయటపెడుతుందో వేచి చూడాలి.