Rajinikanth : 'మిరాయ్'కు సూపర్ స్టార్ బూస్ట్.. రజనీకాంత్ ప్రశంసలతో సినిమాకు మరింత హైప్!

Rajinikanth : 'మిరాయ్'కు సూపర్ స్టార్ బూస్ట్..  రజనీకాంత్ ప్రశంసలతో సినిమాకు మరింత హైప్!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ' కూలీ' మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.  తమిళంలో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా రికార్డులు సృష్టించింది. గ్రాండ్ సక్సెస్ ను సొంతం చేసుకుని ఫుల్ జోష్ లో ఉన్న రజనీకాంత్.. లేటెస్ట్ గా  తేజ సజ్జా, మంచు విష్ణు నటించిన 'మిరాయ్' మూవీ టైలర్ ను చూశారు.  యాక్షన్ అడ్వెంచర్ తో వస్తున్న ఈ చిత్రంపై ప్రశంసలు గుప్పించారు .  నటీనటులు తేజ సజ్జా, మంచు విష్ణుతో పాటు నటీ నటులకు శుభాకాంక్షలు తెలిపారు.

రజనీకాంత్ ప్రశంసలు.. 
ఈ సందర్భంగా రజనీకాంత్ ట్రైలర్ వీక్షిస్తున్న ఫోటోను సోషల్ మీడియా వేదికగా మంచు మనోజ్ పంచుకున్నారు. 'మిరాయ్' ట్రైలర్  చూసి మమ్మలన్ని ప్రశంసించిన రజనీకాంత్ కి హృదయపూర్వక ధన్యవాదాలు. 'మదరాసి' ఘనవిజయం సాధించినందుకు నా మిత్రుడు శివ కార్తికేయన్  కు అభినందనలు. ఆదరిస్తున్న తమిళనాడు ప్రజలకు , మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.  రజనీ ప్రశంసలతో 'మిరాయ్'పై అంచనాలు ఒక్కసారిగా ఆకాశానికి చేరాయి. 

'మిరాయ్' సినిమా ప్రత్యేకత ఏమిటి?
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ 'మిరాయ్' సినిమా ఒక సూపర్ హీరో ఫాంటసీ యాక్షన్ ప్రాజెక్ట్. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఈ చిత్రానికి మరింత ఆసక్తిని పెంచింది. ట్రైలర్‌లో తేజ సజ్జ పాత్ర రైలులో హై-వోల్టేజ్ ఫైట్‌తో మొదలై, చీకటి శక్తులు, హై-ఆక్టేన్ ఇమేజెస్‌తో కంటికి రెప్ప వేయకుండా సాగింది. తొమ్మిది శక్తి గ్రంథాలను రక్షించాల్సిన యోధుడి పాత్రలో తేజ సజ్జ కనిపిస్తారు.

విలన్ పాత్రలో మంచు మనోజ్
ఇక మంచు మనోజ్ పోషించిన పాత్రలు ఈ చిత్రానికి మరింత బలం చేకూర్చనున్నాయి. కానీ మంచు మనోజ్ 'బ్లాక్ స్వోర్డ్' అనే విలన్ పాత్రలో డార్క్ మ్యాజిక్‌తో స్క్రిప్ట్‌లను నియంత్రించే ప్రయత్నం చేస్తాడు. ఈ సినిమాలో అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్, ఆకట్టుకునే సినిమాటోగ్రఫీ ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్‌గా కూడా వ్యవహరించడం విశేషం.

►ALSO READ | OG Glimpse: గూస్ బంప్స్ తెప్పిస్తున్న‘ఓజీ’ గ్లింప్స్.. ఓజాస్ గంభీరని ఎదుర్కునే ‘ఓమీ’ఇతడే

'మిరాయ్'లో తేజ సజ్జ, మంచు విష్ణు, మంచు మనోజ్‌తో పాటు రితికా నాయక్, శ్రీయ శరణ్, జగపతిబాబు, జయరామ్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. గౌర హరి సంగీతం, నాగేంద్ర తంగళ్ల ప్రొడక్షన్ డిజైన్ ఈ సినిమాకు మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి. సెప్టెంబర్ 12న 2డీ, 3డీ ఫార్మాట్‌లలో ఎనిమిది భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ బ్యానర్ ఈ సినిమా హిందీ డబ్బింగ్‌ను సమర్పించడం ఈ సినిమాకు మరింత విలువను పెంచింది. ఇప్పటికే భారీ అంచనాలతో ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.