
కింగ్ ఆఫ్ రొమాన్స్‌గా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ హష్మీ..‘ఓజీ’లో విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్గా రానున్న ఈ మూవీలో ఇమ్రాన్ ‘ఓం భావు’ అనే కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఇవాళ (సెప్టెంబర్ 2న) పవన్ బర్త్‌డే సందర్భంగా ‘ఓజీ’ (ఓజాస్ గంభీర) ని ఎదుర్కొనే బలమైన ప్రత్యర్థి (ఓమీ) ని పరిచయం చేస్తూ వీడియో రిలీజ్ చేశారు.
‘‘డియర్ ఓజీ.. నిన్ను కలవాలని.. నీతో మాట్లాడాలని.. నిన్ను చంపాలని ఎదురుచూస్తున్న.. నీ ఓమీ’’ అంటూ ఇమ్రాన్ డైలాగ్తో పరిచయం చేసిన ఈ గ్లింప్స్.. బలమైన అంచనాలు పెంచింది. చివర్లో హ్యాపీ బర్త్ డే ఓజీ.. అనే డైలాగ్ మరింత క్యూరియాసిటీని పెంచింది.
ఇప్పటీకే ఇమ్రాన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే అంచనాలు పెంచేలా చేశాడు. ఇపుడు ఈ స్పెషల్ గ్లింప్స్తో పవర్ స్టార్ ఫ్యాన్స్కి గూస్బంప్స్ తెప్పించాడు. వీటికి తోడు తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఇమ్రాన్కి హై ఎలివేషన్ని క్రియేట్ చేసింది. గతంలో పవన్ పరిచయానికి ఇచ్చిన మ్యూజిక్ని బీట్ చేసే మాదిరి ఇంపాక్ట్ తీసుకొచ్చింది.
►ALSO READ | OTT Romantic: ఓటీటీలో దూసుకెళ్తున్న బ్లాక్ బస్టర్ రొమాంటిక్ డ్రామా..
‘సాహో’ ఫేమ్ సుజీత్.. గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామాగా ఓజీని తెరకెక్కించాడు. ఇందులో పవన్‌కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించింది. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీలకపాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ.. దసరా కానుకగా సెప్టెంబర్ 25న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది.