
అనురాగ్ బసు డైరెక్ట్ చేసిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ రొమాంటిక్ డ్రామా ‘మెట్రో..ఇన్ దినో’. ఆగస్టు 29న ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్లో దూసుకెళ్తుంది. మోడర్న్ లవ్, రొమాన్స్, రిలేషన్ షిప్ వంటి అంశాలపై తెరకెక్కిన ఈ మూవీకి ఓటీటీ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.
ఈ రొమాంటిక్ డ్రామా జూలై 4న థియేటర్లో విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ క్రమంలోనే రూ.40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కగా.. రూ.78 కోట్లకు పైగానే వసూలు చేసి శభాష్ అనిపించుకుంది. ముఖ్యంగా ఇందులో ఆదిత్య రాయ్ కపూర్, సారా అలీ ఖాన్, అనుపమ్ ఖేర్, అలీ ఫజల్, నీనా గుప్తాలు గుర్తుండిపోయేలా నటించి మెప్పించారు.
Inke safar alag hain, par manzil ek. Your Metro of mohabbat has just arrived 💕🚇
— Netflix India (@NetflixIndia) August 29, 2025
Watch Metro… In Dino, out now on Netflix.#MetroInDinoOnNetflix pic.twitter.com/38I7Ho48Nu
కథేంటంటే:
కాజోల్ ఘోష్ (కొంకోన సేన్‌శర్మ), మోంటీ (పంకజ్ త్రిపాఠి)ని పెండ్లి చేసుకుంటుంది. ఒక రోజు హోలీ పార్టీలో అతని ఫ్రెండ్స్ కొందరు వివాహేతర సంబంధం గురించి అతనితో డిస్కస్ చేస్తారు. అప్పటినుంచి అతని వైవాహిక బంధం బలహీన పడుతుంది. తన వివాహ జీవితాన్ని మళ్లీ ఫ్రెష్‌గా మొదలుపెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు.
మరో వైపు కాజోల్ తల్లి శిబానీ ఘోష్ (నీనా గుప్తా) పాతికేండ్లకు పైగా వైవాహిక బంధంలో తన భర్త నుంచి గౌరవాన్ని పొందలేకపోతుంది. లైఫ్ గందరగోళంగా ఉన్న అదే టైంలో ఒకసారి ఆమె కాలేజీ రీయూనియన్‌కు వెళ్తుంది. ఇన్నాళ్ల జీవితంలో అక్కడే స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నట్టు ఆమెకు అనిపిస్తుంది.
►ALSO READ | Anushka Shetty : ప్రభాస్ పై మనస్సులోని మాట బయటపెట్టిన అనుష్క.. ఏం చెప్పిందంటే?
అక్కడే పాత ఫ్రెండ్ పార్థ్ (ఆదిత్య రాయ్ కపూర్) ఆమె జీవితంలోకి అడుగుపెడతాడు. మరోవైపు శిబానీ చిన్న కూతురు చుమ్కి (సారా అలీ ఖాన్) ఆనంద్ (కుష్ జోత్వానీ)తో రిలేషన్‌లో ఉంటుంది. కానీ.. కొన్ని కారణాల వల్ల అతని మీద నమ్మకం కోల్పోతూ ఉంటుంది. ఇలా.. ఈ కథలన్నింటిలో చివరికి ఏం జరిగింది? తెలియాలంటే సినిమా చూడాలి.