రకుల్ ప్రీత్ సింగ్ హిట్ చూసినట్టేనా…

రకుల్ ప్రీత్ సింగ్ హిట్ చూసినట్టేనా…

రకుల్ ప్రీత్ సింగ్ నటించిన హిందీ సినిమా ‘దే దే ప్యార్ దే’ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయి మిక్స్ డ్ టాక్ వచ్చింది. దీంతో రకుల్ బాలీవుడ్ లో నిలదొక్కుకున్నట్లే అని అంటున్నారు సినీ విశ్లేషకులు. 2014 లో యారియాన్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది రకుల్. ఆ తర్వాత.. 2018 లో అయ్యారే సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు రకుల్ కు సక్సెస్ ను ఇవ్వలేకపోయాయి. దీంతో తన మూడవ సినిమా ‘దేదే ప్యార్ దే’ పైనే ఆశలు పెట్టుకుంది రకుల్.

ప్రస్తుతం ఈ సినిమాకు అవేరేజ్ టాక్ నుంచి ఎబో అవేరేజ్ వైపు వెళ్తుంది. ఈ మూవీ హిట్టా ఫట్టా తెలియాలంటే ఇంకో రెండు రోజులు వెయిట్ చెయ్యాల్సిందే. ఈ మూవీలో అజయ్ దేవగన్ 50 ఏళ్ల వయసున్న పాత్రలో నటించాడు. తన కన్నా 25సంవత్సరాలు తక్కువ వయసున్న యువతితో ప్రేమలో పడతాడు. అజయ్ ను ప్రేమించే అమ్మాయిగా రకుల్ నటించింది. అజయ్ భార్యగా టబు యాక్ట్ చేసింది. ఈ సినిమాకు అకీ అలీ దర్శకత్వం వహించారు.