కొత్తదనం కావాలి

కొత్తదనం కావాలి

ఈ మధ్య కాలంలో హిందీ సినిమాలతో బాగా బిజీ అయిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. సౌత్‌‌లో ఒకట్రెండు సినిమాలు మాత్రమే చేస్తోంది. కానీ బాలీవుడ్‌‌లో చేతినిండా సినిమాలే. వాటిలో మొదటగా ‘అటాక్‌‌’ రిలీజవుతోంది. ఏప్రిల్ 1న రానున్న ఈ సినిమా ప్రమోషన్‌‌లో పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా ఉంది రకుల్. ఈ సందర్భంగా తన కెరీర్‌‌‌‌ గురించి ఓపెన్‌‌గా మాట్లాడింది. ఇప్పుడు తాను ఉన్న పొజిషన్ తనకి చాలా సంతోషాన్ని కలిగిస్తోందని చెబుతోంది. అవును మరి. ఒకటీ రెండూ కాదు.. ఈ సంవత్సరం ఆమె నటించిన ఆరు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ‘ప్యాండమిక్ వల్ల సినిమాలన్నీ ఆలస్యమయ్యాయి. అయితేనేం.. ఎట్టకేలకి వాటిని పూర్తి చేశాను. వరుసగా ఆరు సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలా ఎక్సయిటింగ్‌‌గా అనిపిస్తోంది’ అంది రకుల్. ఇన్ని సినిమాలు చేస్తున్నా, మంచి కాన్సెప్ట్ దొరికితే ఓటీటీలోనూ అడుగు పెడతానంటోంది రకుల్. ‘థియేటర్లు, సినిమాలు లేనప్పుడు ఓటీటీలు ప్రేక్షకులకు కావలసినంత ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్‌‌ని అందించాయి. దానివల్ల రకరకాల కంటెంట్‌‌ ఆడియెన్స్‌‌ని రీచ్ అయ్యింది. వాళ్లు కొత్త కంటెంట్‌‌ని ఆదరిస్తున్నారు. నేను కూడా ఆ కొత్తదనాన్ని కోరుకుంటున్నాను. మంచి సబ్జెక్ట్ అయితే చాలు.. ఓటీటీకి పని చేయడానికి కూడా నేను సిద్ధమే’ అని చెప్పింది రకుల్. ఆల్రెడీ కాజల్, తమన్నా, సమంత లాంటి వారంతా డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. ఇక రకుల్ కోరిక తీరడమే మిగిలింది.