కరోనాపై పోరులో మీ సాయం కావాలి: రకుల్ ప్రీత్ సింగ్

కరోనాపై పోరులో మీ సాయం కావాలి: రకుల్ ప్రీత్ సింగ్

ముంబై: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. సెకండ్ వేవ్ దెబ్బకు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో మహమ్మారి పై పోరాడేందుకు సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. సోనూ సూద్ తోపాటు ప్రియాంక చోప్రా లాంటి బాలీవుడ్ సెలబ్రిటీలు ఏర్పాటు చేసిన ఫండ్ రైజింగ్ కు మంచి ఆదరణ దక్కింది. ఈ క్రమంలో మరో పాపులర్ సెలబ్రిటీ చేరింది. తన నటన, గ్లామర్ తో తెలుగు, హిందీ సినీ అభిమానుల మతి పోగొడుతున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. కరోనా మీద పోరుకు రకుల్ సై అని చెప్పింది. ఆమె కూడా ఫండ్ రైజింగ్ మొదలుపెట్టింది. విరాళాల ద్వారా కరోనా రోగులకు చికిత్సలో ఉపయోగపడే ఆక్సిజన్ సిలిండర్లు, కాన్ సంట్రేటర్లు, లైఫ్ సేవింగ్ ఎక్విప్ మెంట్ అందించాలనేది ఈ ముద్దుగుమ్మ ఆలోచన అట. అందుకే తమ GIVE INDIA ఫండ్ కు విరాళాలు అందించాలని అభిమానులను కోరింది.

'భారత్ కరోనా ఉధృతితో వణుకుతోంది. వైరస్ చాలా వేగంగా వ్యాప్తి అవుతోంది. ఇంకెందరి ప్రాణాలు పోతాయోనని భయమేస్తోంది. మహమ్మారిపై మనం కలసికట్టుగా పోరాడాలి. దయచేసి మా Give India Fundకు డొనేట్ చేయండి. మీరిచ్చే చిన్న మొత్తం కూడా ఎంతో అవసరమని గుర్తించండి. మీరిచ్చే డబ్బులతో ప్రజల ప్రాణాలను కాపాడే ఎక్విప్ మెంట్ ను అందిస్తాం. నాకు మీ సాయం కావాలి. రండి.. కలసి యుధ్దం చేద్దాం' అని రకుల్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakul Singh (@rakulpreet)