ఆ వార్త చదివినప్పుడు నా రక్తం మరిగిపోయింది

ఆ వార్త చదివినప్పుడు  నా రక్తం మరిగిపోయింది

కొంతమంది యాక్టర్స్‌‌‌‌‌‌‌‌ ఓవైపు నటిస్తూనే సమాజ సేవ కూడా చేస్తుంటారు. అయితే కరోనా వచ్చిన తర్వాత దాదాపు అందరూ ఏదో ఒక రకంగా ఇతరులకు సాయపడటానికి ప్రయత్నిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్‌‌‌‌‌‌‌‌ కూడా కరోనా బాధితులకు అండగా నిలబడుతోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొందరు చేస్తున్న దారుణాలు చూస్తుంటే తన రక్తం మరిగిపోతోంది అంటోంది రకుల్. రీసెంట్‌‌‌‌‌‌‌‌గా ఆమె మాట్లాడుతూ.. ‘ఈమధ్యనే నేను పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓ రేప్ గురించి చదివాను. నా రక్తం మరిగిపోయింది. అసలిప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? ఈ సమయంలో ఇలాంటి పనులు చేస్తున్నారంటే వాళ్లసలు మనుషులేనా? ఒకరికొకరు సాయం చేసుకోవాల్సింది పోయి ఇప్పుడు కూడా ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నారంటే వీళ్లనేమనాలో అర్థం కావట్లేదు’ అంటూ సీరియస్ అయ్యింది రకుల్. ‘జీవితం చాలా చిన్నది. ఏ రోజు ఎవరం ఎలా ఉంటామో తెలీదు. దానికి ఇప్పుడున్న పరిస్థితులే ఉదాహరణ. కాబట్టి ఉన్నన్నాళ్లూ మంచిగా, ప్రేమగా ఉండాలి. అందరూ ఇది తెలుసుకుంటే బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అని కూడా చెప్పింది. ఇక కెరీర్ విషయానికొస్తే కొద్ది రోజులుగా లాక్‌‌‌‌‌‌‌‌డౌన్ వల్ల రకుల్ చేస్తున్న సినిమాలన్నింటికీ బ్రేక్ పడింది. పరిస్థితులు చక్కబడగానే అవన్నీ సెట్స్‌‌‌‌‌‌‌‌కి వెళ్లనున్నాయి. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ నటిస్తూ, చేతి నిండా సినిమాలతో బిజీబిజీగా ఉంది రకుల్. అయినప్పటికీ సొసైటీ కోసం కాస్త టైమ్ కేటాయించడం మెచ్చుకోవాల్సిన విషయమే.