ఇండస్ట్రీలో ఫిమేల్ సెంట్రిక్ సినిమాల సంఖ్య పెరగాలి

ఇండస్ట్రీలో ఫిమేల్ సెంట్రిక్ సినిమాల సంఖ్య పెరగాలి

ఇండస్ట్రీలో ఫిమేల్ సెంట్రిక్ సినిమాల సంఖ్య మరింత పెరగాలని రకుల్ ప్రీత్ సింగ్ అంటోంది. రీసెంట్‌‌‌‌గా అక్షయ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌తో కలిసి ‘కట్‌‌‌‌పుత్‌‌‌‌లీ’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిందామె. మరో నాలుగు సినిమాలు రిలీజ్‌‌‌‌కి రెడీ అవుతున్నాయి. అయితే వీటిలోని ఒక మూవీపై ప్రత్యేక చర్చ జరుగుతోంది. అది మరేదో కాదు.. ‘ఛత్రీవాలీ’. పల్లెటూరి నుంచి సిటీకి పని వెతుక్కుంటూ వచ్చిన ఓ అమ్మాయి.. ఏ ఉద్యోగం దొరక్క ఓ కంపెనీలో కండోమ్ టెస్టర్‌‌‌‌‌‌‌‌గా జాయినవుతుంది. దానివల్ల ఆమె లైఫ్‌‌‌‌ ఎలా మారిందనేది ఈ సినిమా కథ. మన సొసైటీ ఓన్ చేసుకోవడానికి కష్టమయ్యే కాన్సెప్ట్ కావడంతో రిజల్ట్ ఎలా ఉంటుందో, అలాంటి పాత్రలో రకుల్ ఎలా కనిపిస్తుందో అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. దీని గురించి రీసెంట్‌‌‌‌గా రకుల్ రియాక్టయ్యింది.

‘కాన్సెప్ట్‌‌‌‌ కాస్త హాట్‌‌‌‌గా అనిపిస్తుంది. కానీ ప్రెజెంటేషన్ మాత్రం చాలా స్వీట్‌‌‌‌గా ఉంటుంది. ఇప్పటికైనా ఇలాంటి విషయాలను ఓపెన్‌‌‌‌గా మాట్లాడకపోతే కష్టం. అసలు ఇందులో ఎలాంటి వల్గారిటీ లేదు. నేను మా ఫ్యామిలీతో కలిసి చూడగలిగే సినిమాలే చేస్తాను. ఇదీ అలాంటిది కనుకే ఓకే చెప్పాను’ అని చెప్పింది. అంతే కాదు.. ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేయడం తనకిష్టం అంటోంది. ‘నాకంటే చిన్నవాళ్లైన జాన్వీ కపూర్, సారా అలీఖాన్ లాంటి వాళ్లు కూడా ఫిమేల్ సెంట్రిక్‌‌‌‌ మూవీస్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రేక్షకులు వాటిని చూస్తున్నారు. అందుకే నేను కూడా ఇలాంటి చాలెంజింగ్ రోల్స్ ఎంచుకుంటు న్నాను. ఇండస్ట్రీలో మరిన్ని ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలు రావాలి కూడా’ అంటోంది రకుల్.