ఏ సినిమా అయినా వాళ్ల పర్మిషన్ తీసుకున్నాకే..

ఏ సినిమా అయినా వాళ్ల పర్మిషన్ తీసుకున్నాకే..

కెరీర్ ప్రారంభంలో గ్లామరస్ పాత్రలే చేసినా.. కాస్త సీనియారిటీ వచ్చాక బరువైన పాత్రల్ని కోరుకుంటారు హీరోయిన్స్. రకుల్ ప్రీత్ సింగ్ కూడా అదే దారిలో నడుస్తోంది. స్ట్రాంగ్ క్యారెక్టర్స్‌‌‌‌కి మాత్రమే ఓకే చెబుతోంది. ఎక్స్‌‌‌‌పెరిమెంట్స్ చేయడానికి కూడా రెడీ అవుతోంది. ఆ ప్రాసెస్‌‌‌‌లోనే ‘ఛత్రీవాలీ’లో నటించడానికి ఎస్ చెప్పింది. ఇందులో ఉద్యోగం వెతుక్కుంటూ ఓ పల్లెటూరి నుంచి సిటీకి వస్తుంది రకుల్. తనకు తగ్గ పని దొరక్కపోవడంతో ఓ కండోమ్ తయారీ కంపెనీలో టెస్టర్‌‌‌‌‌‌‌‌గా చేరుతుంది. అది ఆమె జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించిందనేది మిగతా కథ. ఈ పాత్ర చేయడంపై చాలామంది రకుల్‌‌‌‌ని తప్పుబడుతున్నారు. దాంతో ఆమె రియాక్టయ్యింది. ‘ఇదీ అన్ని పాత్రల్లాంటిదే. దీనినెందుకు తప్పుబడుతున్నారో అర్థం కావట్లేదు. ప్రతి కంపెనీ తాము తయారు చేసిన వస్తువుల్ని పరీక్షించడానికి టెస్టర్స్‌‌‌‌ని పెట్టుకుంటుంది. ఇదీ అంతే. దీనిలో అశ్లీలత ఏమీ లేదు. ఇది చాలా కామన్. పైగా నేను ఈ లైన్‌‌‌‌ని మొదట నా పేరెంట్స్‌‌‌‌కి చెప్పి, వాళ్లు ఓకే అన్నాకే సైన్ చేశాను. అసలు ఏ సినిమా అయినా వాళ్ల పర్మిషన్ తీసుకున్నాకే యాక్సెప్ట్ చేస్తాను. కాబట్టి దీని గురించి ఫీలవ్వాల్సిన అవసరం లేదు’ అని చెప్పింది రకుల్. ఇక దీనితో పాటు అటాక్, రన్‌‌‌‌వే 34, మేడే, డాక్టర్ జి, అయలాన్, మిషన్ సిండ్రెల్లా, అక్టోబర్ 31 లేడీస్‌‌‌‌ నైట్ చిత్రాలు చేస్తోంది రకుల్. నిన్న ‘అటాక్‌‌‌‌’ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ విడుదలైంది. ఇదో సైఫై యాక్షన్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌. ‘ఇస్మార్ట్ శంకర్’లో రామ్‌‌‌‌కి నిధి అగర్వాల్‌‌‌‌ అమర్చినట్టుగా జాన్‌‌‌‌ అబ్రహామ్‌‌‌‌ శరీరంలో రకుల్‌‌‌‌ ఒక చిప్‌‌‌‌ని అమర్చింది. దాంతో అతను సూపర్‌‌‌‌‌‌‌‌ సోల్జర్‌‌‌‌‌‌‌‌గా మారిపోయాడు. యాక్షన్ సీన్స్‌‌‌‌ ఓ రేంజ్‌‌‌‌లో ఉన్నాయి. ఏప్రిల్ ఒకటిన సినిమా విడుదల కానుంది.