నెల రోజుల ముందే..రామ్

నెల రోజుల ముందే..రామ్

రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. శ్రీలీల హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తునారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. రామ్ కెరీర్‌‌‌‌లో ఇది 20వ చిత్రం. శరవేగంగా షూటింగ్‌‌ జరుగుతున్న ఈ చిత్రం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. దీంతో మూవీ రిలీజ్‌‌ డేట్‌‌ పై శుక్రవారం అప్‌‌ డేట్ ఇచ్చారు. సెప్టెంబర్‌‌‌‌ 15న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌లో తెల్ల చొక్కా, పంచెతో కనిపించిన రామ్.. పొలం మధ్య నులక మంచం పైన కూర్చున్న స్టిల్ ఆకట్టుకునేలా ఉంది. 

ఇక నిజానికి దసరా సందర్భంగా అక్టోబర్ 20న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు గతంలో ప్రకటించారు. అయితే అనుకున్న సమయానికంటే ముందే షూటింగ్ పూర్తవుతుండటం, దసరా సీజన్‌‌లో బోయపాటికి ఇష్టమైన బాలకృష్ణ సినిమా వస్తుండడంతో రిలీజ్‌‌ డేట్‌‌లో మార్పులు చేసినట్టు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకే రోజున విడుదల కానుంది.