రామ్ చరణ్ తో ఉప్పెన డైరక్టర్ 

రామ్ చరణ్ తో ఉప్పెన డైరక్టర్ 

ఉప్పెన మూవీతో స్టార్ డైరక్టర్గా పేరు సంపాదించుకున్న  బుచ్చిబాబు సాన ఎట్టకేలకు తన రెండో మూవీని అనౌన్స్ చేశాడు. తన నెక్స్ట్ సినిమాని మెగా పవర్  స్టార్ రామ్ చరణ్ తేజ్ తో చేయడానికి రెడీ అయ్యాడు.  ఈ విషయాన్ని బుచ్చిబాబు తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. RC 16  పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్, వెంకట సతీష్ కిలారు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో  ఈ మూవీ తెరకెక్కతున్నట్లుగా  తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ తో ఓ మూవీ చేస్తున్నాడు. దీని తరువాత  గౌతమ్ తిన్నునూరితో ఒక సినిమా చేయాల్సి ఉంది.  ఆ సినిమా క్యాన్సిల్ కావడంతో ఆ ప్లేస్ లోకి  బుచ్చిబాబు వచ్చి చేరాడు. ఈ  సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించే అవకాశాలున్నాయి. సుకుమార్, రామ్ చరణ్  కాంబినేషన్ లో  వచ్చిన రంగస్థలం చిత్రానికి బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.