RC17 నిజంగా సుకుమార్ తోనేనా.. అప్పడే ఎందుకీ చర్చ!

RC17 నిజంగా సుకుమార్ తోనేనా.. అప్పడే ఎందుకీ చర్చ!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) 15వ సినిమానే ఇంకా రిలీజ్ కాలేదు.. అప్పుడే 17వ సినిమా గురించి చర్చ మొదలైంది. మధ్యలో 16వ సినిమా కూడా ఉంది. ఈ క్రమంలో 17వ సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చ గట్టిగానే జరుగుతోంది. నిజానికి రామ్ చరణ్ 17వ సినిమా సుకుమార్(Sukumar) తో ఉంటుందని సంవత్సరం క్రితమే క్లారిటీ వచ్చింది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీ హార్డ్ హిట్టింగ్ గా ఉంటుందని రాజమౌళి(Rajamouli)కూడా హిట్ ఇవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా మరోసారి రామ్ చరణ్ 17వ సినిమా తెరపైకి వచ్చింది.

అయితే.. ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ తో పుష్ప 2 ను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. దాదాపు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండతో ఒక పాన్ ఇండియా మూవీనీ ప్లాన్ చేశాడు సుకుమార్. కానీ, ఈ సినిమా క్యాన్సిల్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోపక్క పుష్ప 3 కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం దర్శకుడు శంకర్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనే క్లారిటీ ఇంతవరకు రాలేదు. ఈ సినిమా తరువాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తో సినిమా చేస్తారు రామ్ చరణ్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. కాబట్టి షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి కనీసం సంవత్సరమైనా పడుతుంది.

ఇవన్నీ చూస్తుంటే రామ్ చరణ్ 17వ సినిమా రావడానికి కనీసం రెండు సంవత్సరాలైనా పట్టే అవకాశం ఉంది. అప్పటివరకు పరిస్థితులన్నీ ఇలాగే ఉంటాయని నమ్మకం లేదు. కాబట్టి రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో సినిమా ఈ మధ్య కాలంలో ఉండే అవకాశం లేనట్లే అనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి అలాంటి సినిమా గురించి ఇప్పుడెందుకు చర్చ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.