యాక్టింగ్ స్కూల్లో రామ్ చరణ్ ఫస్డ్ డే వీడియో.. ఎలా చేశారో చూడండి!

యాక్టింగ్ స్కూల్లో రామ్ చరణ్ ఫస్డ్ డే వీడియో.. ఎలా చేశారో చూడండి!

రామ్ చరణ్(Ram Charan).. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఈ పేరు ఒక బ్రాండ్. మెగాస్టార్(Megastar) తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం ఇండియాలో ఉన్న టాప్ స్టార్ లలో ఒకడిగా ఎదిగారు చరణ్. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ తో ఆయన క్రేజ్ వరల్డ్ వైడ్ గా విస్తరించింది. ఆందుకే ఆయన ఫ్యాన్స్ రామ్ చరణ్ ను ప్రేమగా గ్లోబల్ స్టార్ అని పిలిచుకుంటున్నారు. 

చిరంజీవి కొడుకుగా చిరుత సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత వచ్చిన మగధీరతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశారు. అప్పటివరుకు ఉన్న స్టార్ హీరోలకి సైతం సాధ్యం కానీ ఎన్నో రికార్డులను కేవలం రెండో సినిమాతోనే తన కైవసం చేసుకున్నారు రామ్ చరణ్. అయితే సినిమాలోకి రాక ముందు రామ్ చరణ్ దేశ విదేశాల్లో యాక్టింగ్ కోర్స్ లు చేశారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ వీడియోలో చరణ్ లాంగ్ హెయిర్ తో.. చేతులను అంటూ ఇటూ ఊపుతూ ఎదో చేస్తూ కనిపించాడు. చుట్టూ మిగతా స్టూడెంట్స్ ఉండటంతో కాస్త సిగ్గుపడుతూ, అసహజంగా కనిపించారు రామ్ చరణ్. అలా కనిపించిన రామ్ చరణ్.. ప్రస్తుతం గ్లోబల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నారంటూ ఆ వీడియో చూసిన ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ మూడు విభిన్నమైన గెటప్ లలో కనిపించనున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు.మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తరువాత రామ్ చరణ్ నుండి వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.