V6 News

ఆట మొదలయ్యేది జనవరిలోనే.. అప్పటికి రామ్ చరణ్ సెట్

ఆట మొదలయ్యేది జనవరిలోనే.. అప్పటికి రామ్ చరణ్ సెట్

ఆర్‌ఆర్‌ఆర్‌(RRR) సక్సెస్ తరువాత రామ్ చరణ్(Ram charan) క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకున్న నేపధ్యంలో.. ఆయన నటిస్తున్న తరువాతి సినిమాలపై ఫోకస్ బాగా పెరిగిపోయింది. మేకర్స్ కూడా అందుకు తగ్గట్టుగానే రామ్ చరణ్ తో సినిమాలు చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు కూడా ఆ రేంజ్ లో వస్తున్నవే. అందులో బుచ్చిబాబు(Buchhi babu sana) సినిమా ఒకటి. 

ఈ సినిమా చాలా రోజుల క్రితమే అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇంకా స్టార్ట్ అవలేదు. ఆ మధ్య ఈ సినిమా అక్టోబర్ లో మొదలవనుంది అనే వార్తలు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం చరణ్, బుచ్చిబాబు సినిమా 2024 జనవరిలో మొదలుకానుంది అని తెలుస్తోంది. దాని గేమ్ ఛేంజర్(Game changer) మూవీనే కారణం. 

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ అనుకున్న దానికన్నా చాలా ఆలస్యంగా సాగుతోంది. ఈ సినిమా మొదలై చాలా కాలం అవుతున్నా ఇప్పటికీ షూటింగ్ కంప్లీట్ అవలేదు. అందుకే చరణ్, బుచ్చిబాబు సినిమా జనవరికి పోస్ట్ పోన్ అయ్యింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక జనవరి నాటికి చరణ్ కూడా ఫ్రీ అవ్వనున్నాడట. ఇక అప్పటినుండి షూటింగ్ గ్యాప్స్ లేకుండా చేసి 2024 ఎండింగ్ కానీ 2025 సంక్రాంతికి కానీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. 

ఇక రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా విషయానికి వస్తే.. రూరల్ బ్యాక్డ్రాప్ లో సాగే రియలిస్టిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రానుంది ఈ సినిమా. రామ్ చరణ్ కూడా  ఈ సినిమాలో సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నారని, శారీరకధారుడ్యం కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోబోతున్నారని తెలుస్తోంది. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమాకు ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు.