గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జూన్ 4న విడుదలకు సిద్దమైంది. ఈ సినిమా కంటెంట్, బుచ్చి బాబు మేకింగ్ స్టైల్, చరణ్ నటన.. ఇవన్నీ సినిమాని సూపర్ డూపర్ సక్సెస్ చేస్తాయని అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే, పెద్ది తర్వాత చరణ్ చేయబోయే ప్రాజెక్ట్స్ పై ఇంట్రెస్టింగ్ టాక్ మొదలైంది. డైరెక్టర్ సుక్కు భాయ్ ఒక్కడే కాకుండా చరణ్ లైన్లో మరో సాలిడ్ గట్స్ ఉన్న డైరెక్టర్ ఉన్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఆ డైరెక్టర్ ఎవరో చూసేద్దాం..
జెర్సీ, కింగ్ డమ్ సినిమాలతో క్రేజీ డైరెక్టర్గా గుర్తింపు పొందిన గౌతమ్ తిన్ననూరితో చరణ్ సినిమా ఉండబోతుందని టాక్. గతంలో వీరి కాంబోలో సినిమా వస్తుందని రూమర్స్ వినిపించాయి. కానీ, చరణ్ బిజీ షెడ్యూల్స్ వల్ల అది సాధ్యపడలేదు. ఇపుడు మాత్రం వీరి కాంబోలో సినిమా పక్కా వస్తుందని సమాచారం. ఇప్పటికే, నిర్మాత నాగ వంశీ స్టోరీ కూడా ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. గౌతమ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ మీద నాగవంశీకి గట్టి నమ్మకం ఉంది. అందుకే ఇప్పుడు మళ్ళీ గౌతమ్ తోనే సినిమా చేయాలని వంశీ ఫిక్స్ అయ్యాడట.
అంతేకాదు.. సెన్సిబుల్ ఎమోషన్స్ను చాలా అద్భుతంగా క్యారీ చేయడంలో గౌతమ్ దిట్ట. అది నానితో జెర్సీ సినిమాలో అద్భుతంగా చూపించాడు. అయితే, అది కింగ్ డమ్తో సెట్ అవ్వలేకపోయిన.. తిరిగి పుంజుకోగలడని వంశీ నమ్ముతున్నాడట. అందుకే చరణ్తో గౌతమ్ తిన్ననూరి సినిమా ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ మొదలైంది. గౌతమ్-చరణ్ కలయికలో వచ్చే ప్రాజెక్ట్ ఎవ్వరూ ఊహించని కథతో ఉంటుందని కూడా టాక్ వినిపిస్తోంది. చరణ్ కోసం గౌతమ్ ఎమోషనల్ స్టోరీని రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇది జెర్సీని మించి ఉండేలా క్యారెక్టరైజేషన్ డిజైన్ చేశాడట గౌతమ్. ప్రస్తుతానికి, ఈ విషయంలో ఎలాంటి అధికారిక అప్డేట్ లేదు. అయినప్పటికీ.. సినిమా ఉంటుందని మాత్రం కన్ఫామ్ అనే చెప్పాలి. చూడాలి మరి ఏమవుతుందో.
'RC17' పై అంచనాలు..
రామ్ చరణ్, క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కాంబోలో ఓ సినిమా రాబోతుంది. సుకుమార్ సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ చాలా విభిన్నంగా ఉంటుంది. 'రంగస్థలం'లో చిట్టిబాబుగా చరణ్ చూపించిన నటనకు మించి ఈసారి ఏదో కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. జూలై 2026 నుండి రామ్ చరణ్ సుకుమార్ సెట్స్‌లో అడుగుపెట్టనున్నారని సమాచారం. ప్రస్తుతం సుకుమార్ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ సినిమా తర్వాతే గౌతమ్ ప్రాజెక్ట్ ఉంటుందని కూడా చర్చ నడుస్తుంది.
