ఆర్ఆర్ఆర్ అప్‌డేట్.. మేకింగ్ వీడియో‌కు డేట్ ఫిక్స్

ఆర్ఆర్ఆర్ అప్‌డేట్.. మేకింగ్ వీడియో‌కు డేట్ ఫిక్స్

హైదరాబాద్: ప్రేక్షకలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. దిగ్దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ మూవీలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు నటిస్తున్నారు. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా చరణ్‌లు తెరపై అలరించనున్నారు. వీరికి జతగా హాలీవుడ్ నటి అలీవియో మోరిస్, శ్రియా శరణ్‌లు యాక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్, సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్‌లు ప్రత్యేక పాత్రల్లో మెరవనున్నారు. ఆర్ఆర్ఆర్ నుంచి అప్‌డేట్‌ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జక్కన్న టీమ్ ఓ అప్‌డేట్ ఇచ్చింది. ఈ మూవీ మేకింగ్‌కు సంబంధించిన వీడియోను ఈ నెల 15న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ ట్వీట్ చేసింది. రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ క్యాప్షన్‌తో గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది.