రెండు సినిమాలతో రాంచరణ్ బిజీబీజీగా..

రెండు సినిమాలతో రాంచరణ్ బిజీబీజీగా..

‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అవడంతో హీరోగా రామ్ చరణ్ స్థాయి మరింతగా పెరిగింది. దీంతో శంకర్ డైరెక్షన్‌‌‌‌లో చరణ్ నటిస్తోన్న సినిమా ఎలా ఉండబోతోందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆగిపోయిందనుకున్న కమల్ ‘ఇండియన్‌‌‌‌ 2’ షూటింగ్‌‌‌‌ను ఇటీవల శంకర్ రీస్టార్ట్‌‌‌‌ చేయడంతో కొంత కంగారు పడ్డారు చరణ్ అభిమానులు. కానీ రెండింటికీ సమన్యాయం చేస్తానని ఆయన క్లారిటీ ఇచ్చారు. అన్నట్టుగానే అతి త్వరలో తిరిగి రామ్ చరణ్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ నెల 8న హైదరాబాద్‌‌‌‌లో వేసిన స్పెషల్ సెట్స్‌‌‌‌లో షూట్ చేయబోతున్నారు. కొన్ని కీలక సన్నివేశాలను హైదరాబాద్‌‌‌‌లో తీసి, ఆ తర్వాత వైజాగ్‌‌‌‌లో షెడ్యూల్‌‌‌‌ను కంటిన్యూ చేయనున్నారు. అక్కడ బ్యాలెన్స్‌‌‌‌ సాంగ్‌‌‌‌ షూట్‌‌‌‌తో పాటు ఔట్‌‌‌‌ డోర్ లొకేషన్స్‌‌‌‌లో కొన్ని సీన్స్ తీయనున్నారు. 

ఈ మూవీలో చరణ్‌‌‌‌కు జంటగా కియారా అద్వానీ నటిస్తోంది. అంజలి, జయరామ్, సునీల్, నవీన్ చంద్ర, సముద్రఖని ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దిల్‌‌‌‌ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విశ్వంభర, సర్కారోడు, అధికారి లాంటి చాలా పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీటిలో దేన్ని ఫైనల్ చేస్తారో చూడాలి. ఇక ఈ మూవీ షూటింగ్ పూర్తవగానే ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌‌‌‌లో చరణ్ నటించనున్నాడు. స్క్రిప్ట్‌‌‌‌ వర్క్ దాదాపుగా పూర్తి కావచ్చింది. యూఎస్‌‌‌‌లో లొకేషన్స్ వెతికే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ ఈ ఏడాది ఈ రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉండనున్నాడు.