PEDDI: ‘హెల్లాళ్లాళ్లో’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. జాన్వీ–శృతితో స్టెప్పుల మోత మోగించిన చరణ్

PEDDI: ‘హెల్లాళ్లాళ్లో’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. జాన్వీ–శృతితో స్టెప్పుల మోత మోగించిన చరణ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించిన ‘పెద్ది’ విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతూ క్రేజీ ప్రమోషన్స్తో దూసుకెళ్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ రికార్డులు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే మోస్ట్ ఎవైటెడ్ రస్టిక్ ఐటెం సాంగ్ విడుదలై ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తోంది.

తాజాగా పెద్ది నుంచి ‘హెల్లాళ్లాళ్లో’ (Hellallallo) ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. రామ్ చరణ్, శృతి హాసన్, జాన్వీ కపూర్ లతో వచ్చిన ఈ మాస్ సాంగ్ థియేటర్లో రచ్చ రచ్చ చేసేలా ఉంది. ఇద్దరు ట్రెండింగ్ భామలతో చరణ్ వేసిన స్టెప్పులు ఫ్యాన్స్ను ఉర్రూతలూగించేలా ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ అందించిన బీట్స్, రక్షితా సురేష్ గాత్రం, అనంత శ్రీరామ్ లిరిక్స్‌, జానీ స్టెప్పులతో పాటకు హైప్ తీసుకొచ్చాయి. 

‘‘సొమ్ములు ఉంటాయి.. సోకులు ఉంటాయి.. సంసారాలు ఉంటాయి.. బాధలు ఉంటాయి... బాకీలు ఉంటాయి.. భారాలుంటాయి.. మనిషిన్నవాడికి ఇది మాములే.. ప్రతిపూట తప్పని పేచీలే.. అడపదడపా, ఇడిసే గడపా, ఏమిటంటా తీపిలే...’’ అని అనంత్ శ్రీరామ్ రాసిన లిరిక్స్ థియేటర్లు ఉగిపోయేలా ఉన్నాయి. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ తన స్టైల్‌కు భిన్నంగా పూర్తి మాస్ బీట్స్ అందించారు. ఆయన కెరీర్‌లోనే ఇది అత్యంత ఎనర్జిటిక్ సాంగ్స్‌లో ఒకటిగా నిలుస్తుందిని చెప్పొచ్చు. 

సరికొత్త రికార్డులు!

ఇప్పటికే విడుదలైన “చికిరి చికిరి” సాంగ్ 200 మిలియన్లకు పైగా వ్యూస్‌తో, “రాయ్ రాయ్ రా రా” సాంగ్ 68 మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. ఇక ఈ స్పెషల్ సాంగ్ ఎలాంటి రికార్డులు కొల్లగొట్టనుందో చూడాలి. వృద్ది సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ జూన్ 3, 2026న వరల్డ్‌వైడ్ ప్రీమియర్స్‌ పడనున్నాయి.  జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.