మెగా ప్రిన్సెస్ కోసం సిద్దమైన స్పెషల్ రూమ్.. ప్రత్యేకతలేంటో తెలుసా?

మెగా ప్రిన్సెస్ కోసం సిద్దమైన స్పెషల్ రూమ్.. ప్రత్యేకతలేంటో తెలుసా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan), ఉపాసన(Upasana) దంపతులు 2023 జూన్ 20న తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ఆరోజునే కొణిదెల వారింట ఆడబిడ్డ అడుగుపెట్టింది. దీంతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. ఇక ఆ మెగా వారసురాలి "క్లిం కారా(Klin kaara)" గా నామకరణం చేశారు. ఇందుకు సంబంధించిన వేడుక కూడా మెగాస్టార్(Megastar) ఇంట అంగరంగ వైభవంగా జరిగింది.

ఇక తాజాగా ఆబుజ్జాయి కోసం ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేశారట రామ్ చరణ్, ఉపాసన దంపతులు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఉపాసన కొణిదెల. ఈ రూమ్ డిజైనింగ్ కోసం ప్రముఖ ఆర్కిటెక్చర్ పవిత్ర రాజారామ్ వర్క్ చేసినట్టు వీడియోలో చూపించారు. ఇక ఈ గది కోసం ఫారెస్ట్ థీమ్ ను తీసుకోగా.. రూమ్ అంతా లైట్ గ్రెయిన్ అండ్ యానిమల్ డ్రాయింగ్స్ తో చాలా అద్భుతంగా కనిపిస్తోంది. తమ బుజ్జాయి అత్యుత్తమమైన మంచి వాతావరణంలో పెరిగేలా చేసేందుకు ఈ స్పెషల్ గదిని సిద్ధం చేసిన్నట్టు తెలిపారు ఉపాసన. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.