మెగా ప్రిన్సెస్ పేరు క్లిన్ కారా (క్లీంకార కొణిదెల)

మెగా ప్రిన్సెస్ పేరు క్లిన్ కారా (క్లీంకార కొణిదెల)

కొణిదెల వారి కోడలు ఉపాసన కొణిదెల ఆడబిడ్డకు జన్మనించిన సంగతి తెలిసిందే. వారసురాలి రాకతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇక జూన్ 30వ తేదీకి పాప పుట్టి పది రోజులు అవుతున్న సందర్బంగా.. బారసాల వేడుకను ఘనంగా జరిపించారు.

ఇందులో భాగంగా పాపకు "క్లిన్ కారా (క్లీం..కార)" అని నామకరణం చేశారట రామ్ చరణ్ ఉపాసన దంపతులు. ఇదే విషయాన్ని ఉపాసన కొణిదెల సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇక "క్లిన్ కారా" అనే పేరును లలితా సహస్రనామాల నుండి తీసుకున్నారని సమాచారం.