యూవీ నుండి వీ అవుట్.. ఇప్పుడు వీ మెగా పిక్చర్స్

యూవీ నుండి వీ అవుట్.. ఇప్పుడు వీ మెగా పిక్చర్స్

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థల్లో యూవీ క్రియేషన్స్ ఒకటి. ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమాతో మొదలైన ఈ సంస్థ ప్రయాణం.. అతి కొద్దికాలంలోనే స్టార్ నిర్మాణ సంస్థగా ఎదిగింది. యూవీ క్రియేషన్స్ లో వీ అంటే విక్రమ్ అని అర్థం. అయితే.. తాజా సమాచారం మేరకు విక్కి మరో కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించానున్నాడట. అది కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి. 

ఈ ఇద్దరు కలిసి స్టార్ట్ చేస్తున్న కొత్త బ్యానర్ కు "వీ మెగా పిక్చర్స్" అనే పేరును కూడా ఫిక్స్ చేసారని సమాచారం. ఇక ఈ కొత్త బ్యానర్లో మొదటి సినిమాగా అక్కినేని అఖిల్ సినిమా రానుందట. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే మొదలయ్యాయని టాక్. 

ఇక ఈ సినిమా తరువాత టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణుతో కూడా ఒక సినిమా చేయనున్నారు. అంతేకాదు.. అతి త్వరలో మెగాస్టార్ హీరోగా ఒక సినిమా కూడా చేయనున్నారని సమాచారం. ఈ సినిమాను ఒక యంగ్ డైరెక్టర్ తెరకేక్కిస్తాడట. మరి ఈ బ్యానర్ రానున్న సినిమాలి ఆడియన్స్ ను ఎ రేంజ్ లో అలరించానున్నాయో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.