‘పెద్ది’ భోపాల్ మ్యూజికల్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ పాల్గొన్నారు. ఇందులో భాగంగా క్రికెటర్ల గురించి ఒక్క మాటలో చెప్పాలంటూ హోస్ట్ ర్యాపిడ్‌ఫైర్ నిర్వహించారు. ఈ సందర్భంగా చరణ్ తన మాటల్లో ఒక్కో క్రికెటర్పై తన అభిప్రాయాన్ని షార్ట్ కట్లో చెప్పుకొచ్చాడు. సచిన్ టెండూల్కర్ ప్రయాణాన్ని “సుదీర్ఘ లెజెండరీ రన్”గా, ఎం.ఎస్. ధోనిను “కూల్ అండ్ కాల్మ్”, రోహిత్ శర్మను “అందరి మనిషి”గా అభివర్ణించారు. విరాట్ కోహ్లీ గురించి మాత్రం ఒక్క మాటలో “ఫైర్” అని చెప్పారు.
ఇదే సమయంలో, చరణ్ అనుకోకుండా క్రికెట్, ఫుట్‌బాల్‌ను కలిపి మాట్లాడారు. భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను పొగిడే సమయంలో ‘బుమ్రాను ఫుట్‌బాల్ ప్లేయర్’ అని తప్పుగా వ్యాఖ్యానించారు. “జస్ప్రీత్ బుమ్రా గారు, నేను మీకు పెద్ద అభిమానిని. నాకు ఫుట్‌బాల్ చాలా ఇష్టం. మీరు ఫుట్‌బాల్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్తున్నారు. లవ్ యూ సర్” అని చరణ్ పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ క్రమంలోనే చరణ్ స్పందిస్తూ బుమ్రాకు X వేదికగా క్షమాపణలు తెలిపాడు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదని, ఉత్సాహం మరియు ప్రేక్షకుల మధ్య జరిగిన సహజమైన మానవ తప్పిదమని పేర్కొన్నారు. “అఫ్... కొన్నిసార్లు పేర్ల విషయంలో నేను నిజంగానే చాలా మరిచిపోతుంటాను. బుమ్రా గారికి ఈ పొరపాటుకు క్షమాపణలు. అక్కడి ఉత్సాహం, ప్రేక్షకుల సందడిలో జరిగిన సహజమైన మానవ తప్పిదం ఇది. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా గౌరవిస్తాను, మీ ఆటకి నేను ఒక పెద్ద అభిమానిని. మీరు నిలకడగా బ్యాట్స్‌మెన్‌లను ఉక్కిరిబిక్కిరి చేస్తూ, ప్రతి భారతీయుడు గర్వపడేలా చేస్తారు.” అని చరణ్ ట్వీట్ చేశారు.
Uff… I’m genuinely so forgetful with names sometimes.
— Ram Charan (@AlwaysRamCharan) May 23, 2026
Apologies to @Jaspritbumrah93 Ji for the mix-up - it was a genuine human error in the middle of all the excitement and the crowd 🙏🏼
I truly respect you and I am a huge fan of your game. You make every Indian feel proud when…
ఇక చరణ్ రియాక్ట్ అవ్వడంతో అందరూ కూల్ అయ్యారు. జనాల హోరెత్తించే సౌండ్ లో ఇలాంటివి కామన్ అంటూ చెర్రీ ఫ్యాన్స్ ట్వీట్స్ పెడుతున్నారు. ఏదిఏమైనా పెద్ది కీ ఆవాజ్ మ్యూజికల్ ఈవెంట్ భోపాల్‌లో రచ్చ చేసింది. పెద్దిపై నార్త్ & సౌత్ లో అంచనాలు పెంచుకొచ్చింది.
